పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/723

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లోనూ బయట పెడతారు. ఖాకీ ప్యాంటు, లేదా నిక్కరు, చిరిగిన ఖాకీ షర్టు తలపై దొర టోపీ, ఆ టోపీ పైన ఒక ప్రక్కగా తెల్లటి ఈక, చేతిలో కట్టె తుపాకీ, మెడలో రుమాలు, ముఖాని కంతా తెల్లరంగు పూసుకుని, ప్రెంచి కట్ మీసముతో, కాళ్ళకు బూట్లు తొడిగి ఒక దొరలాగా హంగామా చేస్తూ, అడుక్కుంటూ విరామం లేని తన వాగ్ధోరణితో శ్రోతలను చమత్కారంతో ముంచెత్తుతాడు. ఈ వేషాన్ని బ్రిటిష్ ప్రభుత్వ హయాములో 1943 ప్రాంతాల్లో నాటి బ్రిటిష్ ప్రభుత్వాన్ని దుయ్యపడుతూ, పాసిస్టు దురాక్రమణను వివరిస్తూ, సాంఘిక దుష్టశక్తుల కార్యక్రమాలను వెల్లడిస్తూ నాటి అంధ్ర ప్రజానాట్యమండలి విస్తృతంగా ప్రదర్శించిందని జయధీర్ తిరుమలరావు 'ప్రజా సాహితి ప్రత్యేక కళా రూపాల' సంచికలో వివరించారు.

తెలంగాణా పిట్టల దొర:

ఈ క్రింద సూచించిన కళా రూపం తెలంగాణా గ్రామాల్లో వృత్తి కళాకారులే, తెలంగాణా పోరాటానికి సంబంధించిన సమస్యల నన్నిటినీ పిట్టలదొర వేషంలో పొందుపర్చారు.


అంతా అనుకుంటే అవునేమో అనుకున్న ఊరూరు తిరగడం, ఉత్తుత్త మాటలు చెప్పడం దూటీ పొమ్మంటె దుమ్ము రేగంగ కోక జూడిచ్చిన ... గిదె నా బ్రతికిన బ్రతుకు నా రాతన్నారు ... గీతన్నారు ...ఖర్మన్నారు ...దుమ్మన్నారు కానీ మా రాజీ తెలంగాణా లోని తెగించుకపోయిన ముసలి ముతక తాతలంత తడాకా చూపిస్తుంటే నాకు కూడా రోశం వచ్చి, తుపాకి గట్టిగా పట్టి చివరిలో ...పోరాటంలో పోయనే పోయిన...


ఈ యిజై అన్న అంటే అండ్లేమున్న దనుకున్నారు. మా రాజ్ అంతా రైతులు, కూలీలు వింత వింతగ నన్ను జూసిండ్రు. ఇదేమి లాత్కోరి సాబ్ ఇట్ల బిచ్చమెత్తుట రాత గాదు. గీత గాదు అంతా నీ చేతులనే ఉన్నదన్నారు. అదెందో అనుకుని నా చేతులు చూచే సరికల్ల అన్నీ గీతలే ఉన్నయి. అప్పుడు నే ననుకున్న మారాజ్.

ఏమయ్య ఓ సంఘపోల్లు ఎక్కడ చూస్తే ఏమీ లేదు. చేతులు చూసే గీతలున్నాయ్ _ చేద్దామంటే భూమి లేదు _ వుందామంటే ఇల్లు లేదు. కొందామంటే పైసా లేదు _ తిందామంటే తిండి లేదు.