పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/722

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ఏసుక్రీసు శ్రమావరణాల్ని గూర్చి పాడుతూ ఆయనకు జేజేలు పలికే క్రింది భజన కీర్తన కూడ ఈ కోవలో పేర్కొనదగినది.

ఏడమ్మా మన ఏసూ - ఏడనున్నాడో జై
ఏడనున్నాడో ఆ జాడ తెలియదాయొ ॥ఏడమ్మా॥
నీచిన్ని కాళ్ళల్లొ - శీలలే నాటిరిగ జై
కారినా రక్తంబూ
కాలువలై పారెనుగా ॥ఏడమ్మా॥

ఇలా ఏసు గాథలకు సంబంధించిన భజన పాటలు ఎన్నో ప్రచారంలో వున్నాయి.

ఇతర కళారూపాల క్రైస్తవులు జానపద కళాప్రదర్శనాలను శుభ సమయాలలోనూ, పెండ్లిండ్లు, సమయంలోనూ, పండుగల సమయం లోనూ, మహామహుల స్మృత్యర్ధం జరిపే జన్మ దినోత్సవాలలోనూ, క్రైస్తవ మహా సభలు జరిగే సమయాలలోనూ, ఈ కళాప్రదర్శనాలను ప్రదర్శిస్తారు. ఈ

TeluguVariJanapadaKalarupalu.djvu

కళలు హిందూ క్రైస్తవుల సంస్కృతికి దర్పణాలై క్రైస్తవ సాహిత్యాన్ని సుసంపన్నం చేస్తున్నాయి. క్రైస్తవ సాహిత్యం జానపద కళలన్నిటిలోనూ ఉండటం గమనించదగిన విషయం.


తెలంగాణా లత్కోర్‌సాబ్

పిట్టలదొర వేషం ఆనాడు బ్రిటిష్ వాళ్ళు వేషధారణను పోలి వుంతుంది. ఒక విధంగా తెల్లవాళ్ళ వేషాన్నీ, భాషనూ హేళన చేసేటట్లుగానూ వుంటుంది. నాడు సమాజంలో వున్న దుర్మార్గాలను ఎత్తిచూపుతూ హాస్యంతో ప్రజలను వినోదపరుస్తూ విజ్ఞానపర్చే నాటి జానపద కళారూపమే పిట్టల దొర. ఈ వేషాన్ని నాటి పగటి వేషధారులందరూ ప్రదర్శించేవారు.

లత్కోర్ సాబ్:

పిట్టలదొర వేషాన్నే లత్కోర్ సాబ్ "బుడ్డర్ ఖాన్" తుపాకి రాముడు అని పిలుస్తారనీ, అది పగటి వేషాల్లో ఒక రకమనీ, గ్రామాలలో ప్రదర్శించే పిట్టలదొర వేషగాళ్ళు సమాజంలో వున్న కుళ్ళు విషయాలను హాస్యంతోనూ, వ్వంగ్య రూపం