పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/721

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గేరా ప్రేమయ్య గారి యోహాను శిరచ్ఛేదము బుర్ర కథలో బ్లాకు మార్కెట్టు బంధించబడాలని చెప్పే క్రింది ప్రబోధాన్ని చూడండి.

కట్టుకొనెడి గుడ్దకు బ్లాకు
పెట్టుకునే దీపానికి బ్లాకు
తిందామంటే తిండి బ్లాకు
మగ్గిపోయిన బియ్యం బ్లాకు
పప్పు పప్పులన్నియు బ్లాకు
పంచదారయు బెల్లము బ్లాకు
కట్టెపుల్లల కసలే బ్లాకు
వీధిలో యంగళ్ళన్నీ బ్లాకండో

తందాన
"
"
"
"
"
"
తందాన

ఇలా క్రైస్తవ బుర్ర కథలలో సామాజిక రుగ్మతలను గురించి కూడా ప్రస్తావించారు.

భజనలు:

పని పాటలు అయిపోయిన తరువాత పల్లెల్లో మామూలుగా భజనలు చేస్తూ వుంటారు. వీటిలో చెక్క భజనలు, పండరి భజనలు, హరి భజనలు , శాపమూళ్ళ భజనలు మొదలైనవి వున్నాయి. ఈ భజనలన్నీ భారత రామాయణ గాధలకు సంబంధించి భక్తి భావంతో కూడుకున్నవి. ఈ భజన పాటల్ని అనుసరించి క్రైస్తవులు కూడ భక్తితో భజన కీర్తనలు వ్రాశారు.

పండరి పురానికి వెళుతూ పండరి భక్తులు "రంగ ఎంత దూరమో ఎరుగము పండారి" అనే పాటను అనుకరిస్తూ__

ఇక నెంత దూరమో - ఎరుగను కానాన్ పురము
ఎరుగను కానాన్ పురము
ఎరుగను కానాన్ పురము
నడచి నడచియు కాళ్ళు - కడు బొబ్బ లెక్కెను _ కడు బొబ్బలెక్కెను

అని పాడుతూ, అలాగే మరో పాట..