పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/724

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈ సొరాజ్యంలో అప్పుడు ఆళ్ళేమన్నారను కుండ్రు, ఇదేవి లత్కోరు సాబు, వేల ఎకరాలు పెట్టిచ్చుకున్న దొరల భూమి అందుకే అచ్చింది దేశానికి సాతంత్రం _ అట్ల జూస్తే ఆయనకు దున్న రాదు _ ఇట్ల జూస్తే నీకు భూమి లేదు. కనుక దున్నుకున్న వాళ్ళు దుక్కి దున్నుకోమన్నరు. తీరా దున్నుకుందా మనుకున్న వరకల్లా ఎదురుంగ ఉన్న దొర భూమి యెదలు దున్నింది. వాళ్ళే దున్నుకొన్నరు. పనికి రాని భూమంతా పడావు పడుంటే ఎట్లనన్న కానీయని ... ఎట్లన్న యేగొచ్చని గుండె పెద్దది చేసుకుని గండికాడి ఎకరం భూమి కబ్జచేసిన ... నన్ను జూసి మా వూళ్ళో వున్న గొల్ల మల్లయ్య, చల్ల రంగయ్య, మాదిగ ముత్తయ్య, దూదిగ రామయ్య, పాలెం పాపయ్య, మాల గోపయ్య, మంగలి లింగయ్య, చాకలి నర్సయ్య, మేకల గురువయ్య, మేడ మీది రామయ్య, పీకే గోపాలం, ఏకే బడే సాబు జుట్టు కింత పట్టినంత దున్ననే దున్నిన్రు _ అల్కనే అల్కింన్రు _ అలికితే మారాజ్_ ఆండ్లేమి పండింది అనుకున్నరు...పందుం అలికెతె ఇద్దుం పండినయ్ _ ఇద్దుంలో కుండెడు తాలు _ బండెడు వడిసిలు _ లాగుల వొడ్లు _ నెత్తిమీద గడ్డి ఈడికి యింత సాలని ఇంటిదారి పడితే కర్నీకం వడ్లకని కాపలాయన రానే వచ్చిండ్రు. ఈ ఏడు ఏమీ లేదు _ ఇద్దుం అలిగితే తూమెడు పండినయ్.

వచ్చే ఏటికి వడ్డీతో ఇస్తనని కరణం పంతులు కాడికెళ్ళీ ఖాతా రాయించి పెట్టుకున్న అంతలోనే యూనియనొచ్చింది. ఇగ నాకే పర్వ అనుకున్న. పంతులు గింతులు గట్టా చేయిస్తరనుకున్న. పట్టా లేదు గిట్టా లేదు _ నెట్టడం మొదలుపెట్టిండ్రు _ఎల్లెలు యెదవ ... యెదవ నా కొడకా దొరోళ్ళ యిళ్ళకు పిలిచి దొంగ నా కొడక అని_ అంగీ లిడిపించి _ బీంగీలు తీయించి తొక్కించి దొబ్బించి తోలిరగ దీయించి ఎల్లెల్లు యెదవనా కొడక, అంటే భూమి లేకుంటనాయె, స్వరాజ్యంల సావుకే వచ్చిందనుకున్న. బతికి బయట పడితే బలుసాకు తిని బతకవచ్చు ననుకున్నా. ఇంటికెళ్ళి చూద్దును గద కుండలు కొడ్లాడు తున్నయ్. పోరగాండ్లు మూలుగుతున్నారు. పొయ్యిల పిల్లి లేవలేదు. ఇంత జూచి ఇదెట్లనాయ్ భూమి అనివోయి దున్ననే దున్నిన _ అల్కనే అల్కిన _ పంట పండే వరకల్లా నాతంట వాసింది. మరి

ఓట్లొచ్చినయ్. ఎడ్ల గుర్తు డబ్బాలకు అసలే వద్దంటున్నరు _ ఎన్నికల అత్తిడికి తెల్లోడు _ పోయ్ నల్లోడు వచ్చనే వచ్చిండు _ మెల్లగ మాట తిరిగ బెట్టి నల్లగ నాటిగస్తి? రాయనేరాసిన్రు.