పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/710

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

678

జానపదకళారూపాలు


స్తారు. హస్తం పంజా రూపంలో వుంటుంది గనుక వీటిని వుంచే స్థలాన్ని పీర్ల పంజా అంటారు. ఈ పీర్లకు కొన్నిటికి అయిదు వ్రేళ్ళు, కొన్నిటికి నాలుగు వ్రేళ్ళు, అలా మూడు, రెండు, ఒకటిగా విగ్రహాలుంటాయి. ఈ హస్తాలను పొడుగాటి కర్రల చివర భాగంలో అమర్చుతాడు. వాటిని రంగు రంగుల గుడ్దలతో అలంకరించి రక రకాల రంగుల కాగితాల పూల దండలను నిలువెల్ల అలంకరిస్తారు.

ప్రతి రోజూ ఆ పీర్ల పంజాలను సాంబ్రాణి ధూపంతో పూజిస్తారు. పీర్లను దర్శించటానికి పిల్లలు పెద్దలు వచ్చిపోతూ వుంటారు. ఆనాడు హిందూ ముస్లింల మధ్య ఏ మాత్రం భేదాలకు తావు లేకుండా సామరస్యపూర్వకంగా పూజిస్తారు.

పులి వేషాలు:

పీర్లను పంజాలొ నెలకొల్పిన తరువాత ఆవేశపరులైన ముస్లిం సోదరులు పులి వేషాలను ధరించి డప్పుల వాయిద్యానికి అనుగుణంగా నృత్యం చేస్తూ, పెద్ద పులి నృత్యం చేస్తూ, పులి చేష్టలను అనుకరిస్తూ, హుంకరిస్తూ పిల్లలను భయపెడుతూ హంగామాగా వీధులన్నీ తిరుగుతూ పెద్ద పులి ఠీవిలో హుందాగా నడక నడుస్తూ పల్టీలు కొడుతూ ప్రతి ఇంటికీ వెళ్ళి వ్వాచిస్తారు. ఈ ప్రదర్శనాన్ని అందరూ ఎంతో ఆసక్తితో తిలకిస్తారు. పారితోషికాలనిస్తారు. ఇలా సంపాదించిన డబ్బును అఖరు రోజున ఆనందం కోసం ఖర్చు పెడతారు.

నిప్పుల గుండం:

పీర్లను మసీదు నుండి బయటికి తీసి విచార వదనాలలతో, సన్నాయి మేళంతో శోక గానం చేస్తూ ఊరంతా ఊరేగింపుకు బయలు దేరుతారు. తారతమ్యాలు లేకుండా అందరూ తరలి వస్తారు. ప్రతివారు సాంబ్రాణి ధూపంతో హారతి నిచ్చి, పారితోషికాల నిచ్చి ఆ విధంగా హసన్, హుస్సేన్ లకు జోహారు లర్పిస్తారు.