పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/709

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
677
పీర్ల పండుగలో మొహరం గీతాలు


పేటికలో వుంచి మరుసటి "మొహరం నెల వరకు" ముజావర్ వద్ద భద్ర పరచటం జరుగుతూ వుంటుంది.

ఆంధ్రదేశంలో వున్న ముస్లిములు అన్ని ప్రాంతాలలోనూ ఈ పండగను ఎంతో భక్తిగా జరుపుకుంటారు. ఎంతో ఉద్వేగంతో అమర వీరుల్ని స్మరిస్తారు. ఈ సందర్భంలోనే మొహరం గీతాలను అలాపిస్తారు.

మహమ్మదీయులకు విగ్రహారాధన లేదు. కాని ముస్లింలలో ఒక తెగ వారు మాత్రం ఈ పేర్లను ప్రతిష్టించి ధూపదీప నైవేద్యాలతో పూజిస్తారు.

హిందూ ముస్లిం ఐక్యత:

కొన్ని ప్రాంతాలలో ఇతర మతాల వారికి ముఖ్యంగా హిందువులకు కూడ పీర్ల పండగను పెద్ద పండుగగా భావిస్తారు. హిందూ మహమ్మదీయుల సామరస్యమే ఇందుకు కారణం. అంటే జాతీయ సమైక్యతకు ఆనాడే ఎంతటి ప్రాముఖ్యమిచ్చారో మనం అర్థం చేసు కోవచ్చు.

ఫీర్ అంటే మహాత్ముడు, ధర్మ దేశికుడని, డా॥ టి. దోణప్ప గారు కూడ తమ జానపద కళా సంపద గ్రంథంలో ఉదహరించారు.

ముస్లిములలో ముఖ్యంగా దూదేకుల వారు ఆటలమ్మ,మారెమ్మ మొదలైన హిందువుల దేవతలను కొలవటం తమ పిల్లలకు ఎఱ్ఱెప్ప, ఎల్లమ్మ, తిమ్మప్ప, నారసింహులు, బాలన్న అనే పేర్లు పెట్టుకోవటమూ, అలాగే హిందువులలో కుల్లాయమ్మ, దస్తగిరి రెడ్డి, నబీగౌడు ఫక్కీరప్ప, మస్తాన్ రావు, లాలెమ్మ, సేకణ్ణ, సైదల్లీ, హుసేన్ దాసు అనే ముస్లిం పేర్లను పెట్టుకోవటం అలాగే ముస్లింలకు సంబంధించిన ఉరుసులలోనూ, పరసలలోనూ పాల్గొనటం, దరగాలకు, మసీదులకూ వెళ్ళటం, పీర్లను కొలవటం సర్వసామాన్యంగా జరిగే విషయాలు.

పీర్ల పంజా:

మొహరం నెలలో చంద్రుడు స్పష్టంగా కనిపించిన అయిదవ రోజు రాత్రి పంజా కపిటార అనే విగ్రహాల నుంచిన పెట్టెను,ముజావిరు అనే అర్చకుని ఇంటి నుండి పీర్ల మసీదుకు ఊరేగింపుగా తెస్తారు. ఆ విగ్రహాలకు పది రోజులు పూజలు జరుగుతాయి. పీరులంటే వీరుల యొక్క హస్తాకృతిలో, విగ్రహాల రూపంలో కొలు