పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/711

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
679
పీర్ల పండుగలో మొహరం గీతాలు


ఊరేగింపు అయిన తరువాత రాత్రికి ఊరు మధ్యలో నున్న నిప్పుల గుండం దగ్గరకు వస్తారు. ఆఖరు రోజున బహిరంగ ప్రదేశంలో ఒక గుంట తీసి అందులో పెద్ద పెద్ద కట్టెలు పేర్చి నిప్పు ముట్టిస్తారు. అది బాగా మండి కణకణ మండే బొగ్గులుగా తయారౌతాయి. ఈ సమయానికి ఊరేగింపు ముగుస్తుంది.

హసన్, హుస్సేన్ పేరులతో పాటు, వారితో పాటు ప్రాణా లర్పించిన వీరుల పీర్లను కూడా పట్టుకుని హసన్, హుస్సేన్ __ హైసాయి, జూలోయ్ అంటూ ఆవేశపు కేకలతో పీర్లను చేత బట్టి వుధృతంగా మారు మోగే సన్నాయి , డప్పు వాయిద్యాల

TeluguVariJanapadaKalarupalu.djvu

మధ్య పరుగు పరుగున ఆవేశంతో పరుగెత్తుతూ నిప్పుల గుండం మధ్య నుంచి నడిచి పోతారు. ఈ దృశ్యం ప్రేక్షకుల్ని చకితుల్ని చేస్తుంది. నిప్పుల గుండంలో దూకే వారికి ప్రజలు కూడ కేకలతో మద్దతు నిస్తారు. ఆ విధంగా మృత వీరులైన హసన్, హుస్సేన్ లకూ తదితర అమర వీరులకూ జోహార్లు ఆర్పిస్తారు. ఇలా నిప్పుల గుండంలో నడిచి వెళ్ళడం పీర్ల మహాత్మ్యంగా కీర్తిస్తారు. ఇలా పీర్ల పండుగ ముగుస్తుంది.

ఆ రోజున అందరూ కొత్త బట్టలు ధరిస్తారు. పలావు మొదలైన మాంసాహారాన్ని భుజిస్తారు. అలా ఆ ఆనందంలో పాలు పంచుకోవడానికి ఆత్మీయులైన హిందువులను కూడా విందుకు ఆహ్వానిస్తారు. ఆలా హిందూ ముస్లిం సామరస్యానికి