- ఉత్తేజకర ప్రదర్శనం:
వీరగాథల్ని వీర విద్యావంతులు అనర్గళంగా చెపుతారు. కథాప్రారంభంలో కులదైవమైన మాచర్ల చెన్న కేశవుని ప్రార్థిస్తారు. ఆ తరువాత కథలో వచ్చే వీరులందర్నీ, పేరు పేరునా స్మరిస్తారు. ముఖ్యంగా అంకాళమ్మను ప్రార్థిస్తారు.
వీర గాథలన్నీ వీర రస ప్రధానమైనవి. కథకులు వీరావేశ పరులైన ప్రేక్షకుల్ని ఉర్రూతలూగిస్తారు. యుద్ధ రంగ భట్టాలలో భయానక బీభత్స రసాలు ఎంతో ప్రాముఖ్యాన్ని వహిస్తాయి. కథకుడు కథా సన్నివేశాలలో పలనాటి పౌరుల పౌరుషాన్ని మన కళ్ళ ముందు ప్రత్యక్షం చేస్తాడు. ముఖ్యంగా సాత్విక అంగికాభినయాలతో సన్ని వేశాన్ని బట్టి నృత్యాన్ని కూడ అభినయిస్తారు. రంగ స్థలాన్నంతా దద్దరిల చేస్తారు.
వీర విద్యావంతులు రాష్త్రంలో మరొక చోట ఎక్కడా కనిపించరు. స్థానిక గాథలకే పరిమితమైన కళారూపమిది. ఈనాడు వారి వారి ఆర్థిక పరిస్థితుల ననుసరించి సాంప్రదాయకమైన వేషధారణతో కథలు చెప్పలేకపోతున్నారు. నానాటికీ వీర విద్యావంతుల కళ హీనస్థితిలో పడి పోతూ వుంది. దానిని పునరుద్ధరించాల్సిన అవశ్యకత ఎంతో వుంది.
రాయలసీమ జానపద కళారూపాలు
రాయలసీమలో యక్షగానాల తరువాత "వీథి నాటకాలు, బుర్ర కథలు, విచిత్ర వేషాలు, తోలు బొమ్మలాటలు, హరికథలు" మొదలైనవి విరివిగా ప్రదర్శిస్తూ వుండేవారు. వీటినే బయలాటలనీ, బయలు నాటకాలనీ అనే వారు. వీటిని మాలపల్లెలో వున్న దాసరులు అనే వారు ప్రదర్శిస్తూ వుండేవారు. వీరిని దాసుళ్లనీ, దాసరులనీ