పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/695

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


కొమ్మాయి దాసుళ్ళనీ, మాల దాసరులనీ పిలువబడుతూ వుండేవారు. హరిజనుల్లో ఒక తెగగానూ వారిలో అతీతులుగానూ వుండేవారు. శూద్ర జాతులు బ్రాహ్మణులను కూడా గూడెపు ప్రజలు గౌరవిస్తారు. ఒకనాడు వీటిని దాసరులే ప్రదర్శించినా, ఈనాడు అనేక మంది వాటిని ప్రదర్శిస్తూ జీవయాత్ర చేస్తున్నారు.

కంఠస్థంగా వున్న కళారూపాలు:

వీరు ప్రదర్శించే నాటకాలు అన్నీ వ్రాతప్రతులుగానో, లేక తాటియాకుల గ్రంథాల్లోనో లేక ప్రత్యేక వ్వక్తుల కంఠస్థంగానో నిలచి వున్నాయి. ఒక్కొక్క దేశంలో వున్న ముఖ్య నాయకునికి అనేక నాటకాలు కంఠస్థం అయివుంటాయి. అతను మరణిస్తే, అతినితోపాటే ఆ నాటకాలు కూడ అంతరిస్తాయి. ఈ విధంగా మన ప్రాచీన యక్షగాన సాహిత్యం, బయలు నాటకాల సాహ్యిత్యం అంతా శిథిలమైంది. అయినా ఇప్పటికీ రాయలసీమ పల్లెల్లో అనేక బయలు నాటకాలు ప్రచారంలో వున్నాయి. అవి కూడ కొన్ని అచ్చులో లేవనే చెప్పవచ్చు. వాటిలో కొన్ని మచ్చుకు ఈ క్రింద ఉదహారిస్తాను.

నాటి మేటి నాటకాలు:

దొడ్డ కవి వ్రాసిన "సుగ్రీవ విజయం" కుమ్మారి బాలయ్య వ్రాసిన "సారంగధర " రుద్ర కవి వ్రాసిన "శశిరేఖా పరిణయం" బెడుదూరు రంగాచార్యులు రామాచార్యులు వ్రాసిన "హరిశ్చంద్ర", వేములపల్లి కృష్ణమాచార్యుల "విరాట పర్వం" నరసింహారెడ్డి వ్రాసిన "చుక్కలూరు రామనాటకం." యాదవదాసు రచించిన "గరుడాచల యక్షగానం." మొదలైన పైన వివరంచిన నాటకాలన్నీ నేటి రాయలసీమలో ప్రచారంలో వున్నాయి. ఇవి అన్నీ కూడ పురాణకథా వస్తువులతో కూడినవే. అయినా పల్లె ప్రజలకు అర్థ మయ్యే శైలిలో వ్రాయబడ్డాయి. అంతేగాక ప్రదర్శనా క్రమంలో ప్రతి మాటా అర్థమయ్యేటట్లు విడమర్చి చెప్పేవారు. అందు వల్ల చదువురాని ప్రేక్షకునికి కూడ ఆర్థమయ్యేది. అందుకు ఉదాహరణ యాదవదాసు రచించిన గరుడాచల యక్ష గానంలో__


బాణమెయ్యగలా మృగముల
బట్టి త్రుంచ గలవా