పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/693

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


అంతే కాక కాశి కోక, తలగుడ్డ, కలికి తురాయి. వెండి రేకుతో చేయబడిన ఉమ్మాహో పిట్ట, చంద్రవంక, అందె, కత్తి, డాలు, వీర జోడు, తిత్తి, తాళం, బొడ్దు గంట, బంజా గుడ్డ, డాలుకు బదులుగా కొందరు పిడికత్తిని పుచ్చుకుంటారు. దీనిని అమజాల అంటారు.

విలక్షణమైన ఎన్నో హంగులు:

పెద్ద కత్తిని అడ్డ కత్తి అంటారు. కుడి చేతిలో అడ్డకత్తి, ఎడమ చేతిలో అమజాల, కుడికాలికి బిరుదు అందె, పన్నెండు మూరల తలగుడ్డ,

TeluguVariJanapadaKalarupalu.djvu

తలగుడ్డలో కలికి తురాయి,కాలికి కుడి ప్రక్క చంద్ర వంక, ఉమ్మాహు పిట్ట, మెడ క్రింద కుడివైపున వున్న రొమ్ముకు తురుమణి (తెలుపు మధ్య ఎరుపు) ఎడమ వైపున రొమ్మున జంజెం గుడ్డ (తెలుపు ఎరుపు రెండు రంగులతో ఏడు మూరలుంటుంది , షరాయి, జంజెము, బొడ్డు గంట, త్రికోణాకారంలో వుండే గుడ్డ, దీని చుట్టూ పూసల మధ్య గంట కట్టబడి వుంటాయి. ఇదీ కథకుని వేషం.

ఇలా పన్నెండు బిరుదులు ధరించి కత్తి తిప్పుతూ వీరావేశంతో కథను పాడుతూ వుంటే, నాటి పల్నాటి బాలచంద్రుడు దివి నుండి భువికి దిగివచ్చినట్టుగా వుంటుందట.

వంతల్లో ఒకడు వీర జోడు వాయిస్తాడు. రెండవాడు తిత్తి పడతాడు. మూడవ వాడు తాళం కొడుతూ ఆఁకొటతాడు. ఈ వీర కథా గానంలో కొంత అభినయం, నాట్యం మిళితమై నడుస్తాయి. కథకుడూ, వంతలూ, అందరూ నిలబడే పాడతారు. పల్నాటి వీర కథలని రాత్రి వేళ వెన్నెల్లో పాడతారే గానీ, దీప కాంతిని ఉపయోగించరట. ఈ ఆచారం ఎందుకు వచ్చిందో తెలియదంటారు డా॥ తంగిరాలవారు.