పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/683

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


కవులు వర్ణించారు:

బుడబుక్కలవారు ప్రాచీనం నుంచీ వున్నవారే. వీరి గురించి అనేక మంది కవులు వారి గ్రంథాలలో వర్ణించారు. కర్నూలు జిల్లాలో 18 వ శతాబ్దానికి చెందిన అయ్యలరాజు నారాయణా మాత్యుడు హంసవింశతిలో వారి వేషధారణ గురించి వివరించాడు.

అలాగే పైడిమర్రి వెంకటకవి చిత్రాంగద చరిత్రలో ఇలా వివరించాడు:

డాకదలిర్చు మబ్బు డుబుడుక్క
మెఱంగు మెఱంగు పట్టనన్
జోక బలాకికా సమితి
చుక్కల నామపురేక, నమ్మబల్
కేక సరోజ భేకకముల
కీడును మేలును దెల్ప కూకగా
జోక ఘనాగమంబు రహిజొచ్చె మహిన్
డుబుడక్క వాడనన్.

అలాగే అధునిక కవులలో కాటూరి, పింగళి తుమ్మల సీతారామమూర్తి మొదలైన వారు బుడబుక్కలవారిని గురించి ప్రస్తావించారు.

ఉత్తర భారతంలో బుడబుడక్కల వారు వున్నారో లేదో తెలియదు, గానీ, మన పొరుగు రాష్ట్రాలైన తమిళ, కన్నడ రాష్ట్రారాలలో వున్నారు. వీరంతా ఒకనాడు ఒక రాష్ట్రంలో కలిసి వున్న వారే. కర్ణాటకలో వీరిని బుడుబుడికె యివరు అని పిలుస్తారు.

ప్రజానాట్య మండలి:

ఆధునిక కాలంలో ప్రజా నాజ్యమండలి కళకారు 1943 నుంచి 1950 వరకూ సాగిన ప్రజా నాట్య మండలి సాంస్కృతిక మహోద్యమంలో ఆ నాటి రెండవ ప్రపంచ యుద్ధ భీభత్సాన్ని గురించి, నాటి కరువు కాటకాలను గురించీ, హిందూ ముస్లిం కలహాల గురించి, బ్లాకు మార్కెట్, లంచ గొండు వుద్యోగుల గురించీ, సంఘ విద్రోహుల గురించీ సవివరంగా

TeluguVariJanapadaKalarupalu.djvu

ప్రజలకు వివరించారు. ఈనాడు రాజమండ్రి విభూతి భవాని లింగంగారు వారి ఇతర పగటి వేషాలతో పాటు బుడబుక్కల వేషాన్ని బ్రతికిస్తున్నారు.