Jump to content

పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/676

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వల జడ _ బొంగు జడ __ పుట్ల జడ . ఈ విధంగా రకరకాల జడలను అల్లుతారు. ఇవి ఎంతో నైపుణ్యంతో అల్లబడతాయి. చూపరులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. బృందంలో ఏ ఒక్కరు తప్పు చేసినా జడ చిక్కుపడి పోతుంది. చిక్కుపడిన జడను విడదీయటం చాల కష్టం ఈ జడలను అల్లటం ఎంతో సాధన చేస్తారు. ఒక జడకూ మరో జడకూ ఏ మాత్రం సంబంధం వుండదు. పాట పాడుతూ, అడుగు వేస్తూనే ఈ కోపులను వేస్తారు. ఈ కోపుల్లో ఒక పాట.

పాట:

పురు॥ రేనాటి సిన్న దాన లలనా రేగి పండు సాయదానా
నీరేని పండు సాయ మీద వాలింది మనసు వాసిముద్దుల గుమ్మ

స్త్రీ॥ నువ్వాడ నేనాడరో సిన్న వాడ
నీకు నాకు జత కాదురా

పురు॥ కొట్టమ్మడిపోయేదాన లలనా
కలువ పండు చీరా దానా
నీ కలువపండు చాయ మీద
వాలిందె మనసు, రాని ముద్దులగుమ్మా

స్ర్రీ॥ నీవేడ నానేడారో సిన్న వాడ

అలాగే కృష్ణుడు కొంటే చేష్టలను గొల్లపడుచు లందరూ యశోదకు విన్నవించే విధం.

పాట:

వో యశోద ఏమి చేయుదము నీ కొడుకు దుడుకులకు
నిన్న సంది వేలమ్మ సిన్నది జలకంబు లాడ
మెల్లిగ సీర లెత్తుకుని వెల్లె గదమ్మా ॥వో యశోద॥

మెల్లమెల్లగాను రేపల్లె వాడలోకి వచ్చి
యన్నముద్ద కుండలన్నీ పడవేసెనమ్మ ॥వో యశోద॥