అద్దరాతిరి వేలమ్మ మిద్దెలోకి వచ్చి నాడు
దద్దరి మా ఆలి మొగుడు యిద్దరాము లేచి రాగా
అద్దకోడ కత్తిరించి పారిపోయెనె
వద్దికామీకేలనాని గుద్ది గుద్ది సంపెనమ్మా ॥వో యశోద॥
- భజనలో దంపుళ్ళ పాట:
కూచొని సెరిగే చేడెకురుల పై, భామ కురులపై
తుమ్మెద వాలెనె భామ గండు తుమ్మెద వాలెను భామ
గండు తుమ్మెద వాలెనే దరనిలో ॥కూచో॥
గొప్పది రోకలి గుప్పున దంచగ జబ్బలు కదులునె భామా
గండు తుమ్మెద వాలెనే భామా ॥కూచో॥
చెమటకు తడిసి చెదరిన గంధము
గుమగుమ లాడెను భామా
గండు తుమ్మెద వాలెను భామా ॥కూచో॥
ఇలా ఎన్నో కొల్లలు కొల్లలుగా భజనలో వాడుకునే జానపద గేయాలున్నాయి.
వీటిలో చాలవరకు ఆయా ప్రాంతీయ భాషా మండలికాలలో ఎన్నో పాటలున్నాయి. ఏది ఏమైనా చెక్కభజన సకల కళాసమన్వితమైన జాన పద నృత్య కళారూపం. దీనిని నేడు తెలుగు విశ్వ విద్యాలయం చేపట్టి
శిక్షణా శిబిరాల ద్వారా పునరుద్ధరిస్తున్నది. దీనిని డా॥ చిగిచర్ల కృష్ణారెడ్డిగారు సక్రమంగా నిర్వహిస్తున్నారు.