పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/675

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


అలాగే కులాన్ని గూర్చి:

కులము కులము అంటారు యక్కడుంది కులము
మల్లీ మల్లీ యీమాట రాకూడదన్నా
నిన్ను కోస్తే రత్తమా నన్ను కోస్తే నీరా
ఏమిటన్నా న్యాయం యక్కడుంది న్యాయం
మనమంతా కలిసి మెలిసి వకటై పోవాలిపుడూ
కలకాలం యీలాగే కలసి మిలిసి వుండాలి ॥కులము॥

జడ కోపులు:
TeluguVariJanapadaKalarupalu.djvu

చెక్క భజన ప్రారంభించి కొంత కార్యక్రమం జరిగిన తరువాత చివరిగా చేసేది జడ కోపులు. ఈ కోపులు ప్రేక్షకుల్ని ఎంతగానో ముగ్థుల్ని చేస్తాయి. అందరూ గుండ్రంగా నిలబడతారు. రంధ్రాలతో కూడిన గుండ్రని చంద్రాకారం గల బిళ్ళను తయారు చేస్తారు. రంధ్రాలలో రంగు రంగుల త్రాళ్ళను వేలాడదీస్తారు. ఆ చెక్కను ఎత్తుగా వున్న ఒక దూలానికి లాగి కడతారు. లేదా గ్రామ మధ్యలో వున్న చెట్టుకు వ్రేలాడ దీస్తారు. దీనిని జడకోపు బిళ్ళ అంటారు. బృందసభ్యులు ఒక్కొక్కరూ ఒక్కొక్క తాడును ఏడమ చేత్తో పట్టుకుని కుడిచేత్తో చెక్కల్ని పట్టుకుని తాళ్ళ సహాయంతో ఆడుగులు వేస్తూ లోపలికి బయటికి గుండ్రాకారంగా తిరుగుతారు. మధ్య గురువు పాటలు పాడుతుండగా కళాకారులందరూ పాట పాడుతూ జడను అల్లుతారు. దీనిని జడ కోపు అంటారు.

రక రకాల కోపులు:

ఈ కోపుల్లో రకరకాల కోపు లున్నాయి. అవి సాదా జడ కోపు _ నూగాయ జడ కోపు _ డబుల్ నూగాయ జడ కోపు _ కరక్కాయ జడ _ గర్భ జడ _ పట్టెడ జడ _ పచ్చల జడ _నాలుగు పచ్చల జడ.