పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/674

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
పాట:

అన్నా ఓ రైతన్నా ఈ లోకమంతా గమ్మత్తురా
లోకమంతా గమ్మత్తురా, కనిపించే దంతా బూటకంరా
పెద్దకొడుకని ప్రేమతో పెంచితి, పెత్తనమంతా చేతికి ఇస్తే,
ముండల మరిగి రొండయిపాయెనే వుండను వూరే
లేదురా, వాడు వూరే విడిచి పాయెరా ॥అన్నన్నా॥

చేని గట్టున జానెడు నరికి, హద్దు రాతిని అవతల పాతి,
పరాయి చేలో పశువులు మేపి సాయంకాలము ఇంటికి వచ్చి,
రామా కిట్నా అంటే శ్రీ రాము డెట్లా నమ్మునయా ॥అన్నన్నా॥

ఇలా ఎన్నో నీటి పాటల్ని భజనల్లో పాడుతారు.

బుడ్డ వెంగళరెడ్డి:

బుడ్డా వెంగళ రెడ్డి అనే ధర్మ ప్రభువుని గూర్చిన గేయాన్ని జాన పదులు చెక్క భజనలో చక్కగా ప్రదర్శిస్తారు. వెంగళరెడ్డి ధర్మదాతేకాక, వీరాధివీరునిగా కూడా కీర్తిస్తారు.

ఉత్తరాది వుయాల వాడలో వున్నది ధర్మం సూడండయ్యా
నేటికి బుడ్డా యంగలరెడ్డి దానాప్రభువని తలచిరయా
గోవిందా యని వన్న వారికి గోవుల దానము చేసెనయా
అరినారాయణ అన్న వారికి అన్న వస్త్రము లిచ్చునయా!

గేయం:

ఇలా ఎన్నో పాటలు పాడటమే గాక సంఘంలో వున్న రౌడీల గురించి, త్రాగుబోతుల గురించి, సంఘ విద్రోహుల గురించీ, మట్కా _ జూదాన్ని గూర్చి ఎన్నో నీతి పాటలున్నాయి. అనేకమైన శృంగారపు పాటలున్నాయి.

కదిరీ సిన్న దానా కందిరీగా నడుము దానా
నినేట్ల మరతునే నెల్లూరి నెర జాణ ॥కదిరి॥

నీ సిలుకు చీరకు రేనుగుంట్ల రైకాకు
యంత సోకాయనే రంగోల్ల రవనమ్మా ॥కదిరి॥