పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/665

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అలాగే ఆయా ప్రాంతాల్లో వీర శైవ మతానికి చెందిన వారు. వీర శైవులు వీర భద్ర విన్యాసాలు చేయడం, వీరావేశంతో ఖడ్గాలు చదవడం, ఆవేశంతో నారసాలు పొడుచుకోవడం, వీరావేశంతో తాండవ పద్ధతిలో నృత్యాలు చేయటం పరిపాటి. ఒకో ప్రాంతంలో, ఒకో పేరుతో అవి జరుగుతూ వుంటాయి. అలా కోనసీమలో అమలా పురం ప్రాంతంలో వీర నాట్యం చేయడంలో నిపుణులున్నారు.

తూర్పు గోదావరి జిల్లా కోన సీమలో వీర నాట్యం చేసే కళాకారు లున్నారు. వీర నాట్యానికి ఒక ప్రత్యేకత, జనాకర్షణా వుంది. వీరనాట్యం దేశవ్వాప్తంగా ప్రసిద్ధి చెందింది.

దక్ష ప్రజాపతి:

దక్ష ప్రజాపతి తల పెట్టిన యజ్ఞానికి కన్న కూతురుకీ, అల్లునికీ ఆహ్వానం అందలేదు. పిలవని పేరంటానికి వెళ్ళకూడదని, పరమ శివుడు వారిస్తున్నా పార్వతి ఆ యజ్ఞానికి వెళ్ళి అవమానం పాలై అత్మాహుతి చేసుకుంది. ఆ ఘటనకు ఉగ్రుడైన ముక్కంటి జటాజూటాన్ని నేలకు కొట్టి, అటనుంచి వీరకుమారులతో ప్రయాణ మయ్యాడు. శూలధారుడై ఆగ్రహ జ్వాలలు గ్రక్కుతూ యజ్ఞ వాటికను చిందర వందర చేసిన వీరకుమారుల పదఘట్టనలే నాట్య మైంది. అదే వీరనాట్యం.

వీరముష్టుల, వీర నాట్యం:

ఆంధ్ర దేశంలో వీర ముష్టులు చేసే వీరనాట్యం శైవ సాంప్రదాయానికి అద్దం పడుతుంది. శివాలయాల్లో జరిగే ధూపసేవ సందర్భంగా ఆలయం ముందు నడివీథిలో వీరనాట్య కార్యక్రమాలు జరుగుతూ వుంటాయి. అలాంటి వీర నాట్యాలు అమలాపురం తాలూకా అయిన వల్లి మండలం. వెలవలపల్లికి చెందిన చింతా వెంకటేశ్వర్లు వీరనాట్యం మీద మోజు పెంచుకుని కట్టుదిట్టంగా నేర్చుకుని, దానినొక కళారూపంగా తీర్చి దిద్ది, వీథుల్లో ప్రజల సమక్షంలో ప్రదర్శించి ప్రశంసలందుకున్న ఈ వీర నాట్య కళారూపాన్ని, జాతీయస్థాయిలో ప్రచారం కల్పిచటానికి విశేషమైన కృషి చేశాడు.

అయిదవ తరగతి వరకు మాత్రమే చదువుకున్న వెంకటేశ్వర్లు ఒక బృందాన్ని తయారు చేసి 1962 నుంచి పలు దేవాలయల ఉత్సవాల్లో ప్రదర్శించాడు. వీరనాట్యం చేసే వారిని వీరకుమారు లంటారు. వీరు మొలకు ఎరుపురంగు గుడ్డలను ధరిస్తారు. కాళ్ళకు గజ్జెలు కట్తి, మెడలోనూ, జబ్బలకు, రుద్రాక్ష మాలలను అలంక