Jump to content

పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/664

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
ఇంటి కొక వీర పుత్రుడు:

ఆ కాలంలో ప్రతి తల్లీ తండ్రీ తమ యింట పుట్టిన పుత్రుల్లో ఒకణ్ణి వీరునిగా దేశానికి అర్పించే వాడుక వుండేదట. వారినే పశుపతులని కూడా పిలిచేవారు. ఈ వీరులు అవివాహితులై దేశరక్షణ కోసం ప్రాణాలు అర్పించేవారట. వీరు ప్రతి రోజూ ఆరు పర్యాయాలు శివార్చన చేసేవారట.

ఆ పూజల్లో భక్తి భావంతో కూడు కున్న నృత్యం ఒక భాగంగా వుండేదట. ఆ నృత్యాలే వీర నాటాలుగా ప్రచారంలోకి వచ్చాయంటారు రామకృష్ణగారు.

ఈ నృత్యాలలో ఏ రస భావం లేని హస్తపాద విన్యాసాలు మాత్రం ప్రదర్శిత మౌతాయి. శివునిచే ప్రదర్శింపబడిన 108 కరణములు అందుకు తగిన చారి భేదాలు కొన్ని ఈ నర్తనంలో ప్రదర్శింపబడుతూవున్నాయి.