రిస్తారు. నుదుట గంభీరంగా విభూతి రేఖలను దిద్దుకుంటారు. చిన్న శూలాలూ, నిలువెత్తుగల పెద్ద శూలాలూ నోటిలో, బుగ్గలకూ, కంఠానికీ ధరిస్తారు. శూలాల చివర నూనెవత్తులు వెలిగిస్తారు. ఆ వెలుగుతో వారు మరింత ఆవేశపరులౌతారు.
- వీర కుమారుల విజృంభణ:
ఆ విధంగా పది మంది వీర కుమారులు రౌద్ర రసాన్ని పోషిస్తూ... ఖండ సంకీర్ణంలో విశ్రజతులపై నాట్యం సాగిస్తారు...వీర కుమారుల
నాట్యానికి అనుగుణంగా ...సన్నాయి, డోలు, తంబురా, తాషామార్పాల ధ్వనులు ఉత్తేజాన్ని కలిగిస్తాయి. దక్ష వాటికలో వీర భద్రుని ఆధ్వర్యంలో నాటి వీర కుమారుల విధ్వంసం ఇతి వృత్తంగా సాగే వీరనాట్యం ప్రేక్షకులకు గగుర్పాటును కలిగిస్తుంది. ప్రజలు కూడ వీరావేశంలో మునిగిపోతారు.
వీర నాట్యం ప్రారంభం, చతురస్ర జాతి నడకలో... తకధిమి... తకధిమి, తకఝణు, తకఝణు, స్వరాలతో ప్రారంభమై దక్షయాగం బెరచి...దక్షుని తల ద్రుంచి దక్ష సంహారమై తరలినావు. అనే పదాలతో, శరభా, అశ్శరభా, దశ్శరభా, శరభ, శరభా అనే నినాదాలతో, శూలాలను నాలుకకూ, కంఠాలకూ గుచ్చుకుని భక్తి తన్మయత్వంతో చేసే వీరనాట్యం ప్రజలను పరవశుల్ని చేస్తుంది. అందరూ ఆవేశంతో ఊగి పోతారు.
చింతా వెంకటేశ్వర్లు 1981 లో రాజమండ్రిలో ప్రదర్శనం ఇచ్చి, ప్రముఖుల ప్రశంసలందుకున్నాడు.నాట్యానికి హైదరాబాదులో రెండు మాసాలు నుంచి శిక్షణ ఇచ్చి దానినొక విశిష్ట కళారూపంగా తయారు చేశారు. ఆ తరువాత రాష్ట్ర వ్వాప్తంగా, అన్ని జిల్లాలలోనూ, ఆకాశవాణిలోనూ, అప్నా వుత్సవం లోనూ, ఇతర రాష్ట్రాలలోనూ వెయ్యి
ప్రదర్శనాలకు పైగా ప్రదర్శనలనిచ్చారు. వెంకటేశ్వర్లుకు చదువు లేక పోయినా, పట్టుదలతో వీర నాట్యాన్ని అభివృద్ధి పర్చి, దానికొక మన్నన తీసు కొచ్చారు.