పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/656

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాలర్లలచ్చిదేవి- బజే బజే
కూకర్ల ముచ్చుదేవి - శివో శివో
మోకర్ల బిచ్చాదేవి - హరో హరోం
కాకుల లెచ్చుదేవి - పాండ్రో పాండ్రో
బాకా మూల్గు నేలలోకి - మాకు జగావత్తారు
మమ్ము ముంచి పోతారు.

ఆడ పిల్లలు అత్తవారింటికి త్వరగా వెళ్ళనట్టయితే, పక్క ఇంటి అమ్మలక్కలు ఆ అమ్మాయి దరి జేరి ఈ విధంగా పాడుతారు.

తొలి జంగమేలకే పో, పోవమ్మా
మలి జంగమేలకే రా రా ॥బిట్రో - నిట్రో॥

నెలచెరువు రాకే రారావమ్మా
కోలాకుర్లు రాకే పోపో ॥బిట్రో - నిట్రో॥

మాలాగ నగుచూ రా రావమ్మా
తో తొందరగానే పోపోపో. ॥బిట్రో - నిట్రో॥

ఈ పాటనే రాయలసీమలోని పశువులకాపరులు ఈ విధంగా పాడుతారు.