పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/657

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


పశువుల కాపరుల పాటలు:

ఓ, ఓలేటి జంగామయ్యా- బిట్రాయుడు - నిట్రేశ్వరి
కాల్లు గాలు టెండలోన కాపలాగా యాయుచుండే
వులవ దంటు ఉదరపైన ఊగుతూ
వుండినావో ఏమో మొండి గానే జెప్పా?

ఓ, ఒడ్డి కాసు మెంకట్రమణ, బిట్రాయుడు - నిట్రేశ్వరి
దొడ్డి దోలిదొల్లుకుంటు నీవు ఎడ్డినాలు జేస్తుంటే
పడ్డ రామి తెర్వుగానె గడగగా నే జెప్పా?
ఓ అహోబిల నరసింహ - బిట్రాయుడు - నిట్రేశ్వరి

గుహలలోనికి గుల్ల దోలీ- గుండ్లుపైన నిలచేసి
అహిల యహిల మని యంటూ - దరువుతో మూదరేయు
గిహిలకాడ నుంచి వేమో - కేరూతునే జప్పా?
ఓ కోట్ల కొండయ మామ - బిట్రాయుడు - నిట్రేశ్వరి.

కొలిమి కుంట్ల కులికన్నకూ పుట్టారో ॥బిట్రో- నిట్రో॥
మతిపోనీ దుత్తాయితో మా ముగ్గురు

సాల్ సాల్ మనేదాకా:

సాల్ సాల్ మనే దాకా మని గాండ్రు ॥బిట్రో- నిట్రో॥
సంకలోని పిల్లతోటి - సాల్ సాల్ మనే దాకా ॥బిట్రో॥
కొల్లు బారెడైన దాక - కందిరీగ లాంటివాల్లు ॥బిట్రో॥
ఎదిగి దాని ఎత్తే లోగ ఏటేటా ఇరు జతలు ॥బిట్రో॥
పెమ్మికుంట నాగరాజుకూ పుట్టారో ॥బిట్రో॥
తుమ్ము తుమ్మవలను లేని డూడ లాంటి మోటు వాల్లు ॥బిట్రో॥
సాలూకూరి కంబరాయికి పుట్టారో ॥బిట్రో॥

ఎవరైనా అమ్మలక్కలు పోట్లాడుకుంటూ, ఆ తగాదా ఏ విధంగానూ పరిష్కారం కానట్లైతే ఈ దేవుళ్ళను మధ్యవర్తులుగా నిర్ణయించుకుని ఇరుకక్షలవారూ రాజీ పడే వారట. ఆ సందర్భంలో పాడే పాట ఇది.