పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/655

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ముకెబర్ల జంగాల బిట్రో నిట్రో పదాలు

TeluguVariJanapadaKalarupalu.djvu

హైరోసైరో- బిట్రో నిట్రో
జగితగ - బిట్రొ నిట్రో.

అనే మకుటంగా గల బిట్రో నిట్రో పదం కంచు జాగంటపై హృదయాహ్లాదంగా వినిపింప బడుతుంది. ఈ పదాలను పాడేవారు ముకెబర్ల జంగాలూ. ఈ ముకెబర్ల జంగాలనే తెగవారు, కాకతీయ రాజ్య పరిపాలన కాలంలో వారి ఆస్థానంలో వందిమాగదులుగా వున్న శైవులు, ఈ జంగాలు తెలంగాణాలోనూ అటు శ్రీకాకులం జిల్లాలోనూ చెదురు మదురుగా వున్నారని వినికిడి. ముకెబర్ల జంగాలు బిట్రేశ్వ్రరుడు నిట్టేశ్వరీదేవి అనే దేవుళ్ళను ఈ నాటికీ పూజించుకుంటూ వుంటారట. పైన వుదహరించిన దేవుళ్ళ గుళ్ళు ఆంధ్రదేశంలో తాను తిరిగినంత వరకూ ఎక్కడా కనబడ లేదని, పరిశోధకులైన మల్లేల నారాయణగారు ఆంధ్రప్రభలో తెలియచేశారు.

బిట్రేశ్వరుడు, నిట్రేశ్వరి:

బిట్రేశ్వరుడంటే ఈశ్వరుడని, నిట్రేశ్వరి అంటె పార్వతి అని చెపుతారు. ముకెబర్ల జంగాలు, కాని శివ పార్వతులకు శైవ పురాణాల్లోగానీ, ఇతర ఇతిహాసగ్రంథాల్లోగానీ ఎక్కడా బిట్రేశ్వర, నిట్టేశ్వరి పేర్లు వున్న ఉదాహరణలు లేవు. వారు శైవులవడంవల్లా వారి ఇలవేల్పు శివ పార్వతులను స్తుతిస్తూ ఎంతో పసందైన పాటలను పాడుతారు. వారు పాట ప్రారంభించ బోయే ముందు నాందీ ప్రస్తావనగా ఇష్ట దేవతల్ని ఈ విధంగా ప్రార్థన చేస్తారు.

ప్రార్థన, పదం:

ఓ హర హర బిట్రో నిట్రో
అమ్మ బిట్రో - నిట్రోల్లూ బిరబిర వత్తారు
తోడుండు నంతమ్మ నే సెప్పి చాల్లూ.

అని ప్రారంభించి ముకిరెంక దరువు వేస్తూ కంజేగంటల మీద పొడుగైన లావుపాటి పుల్లతో మ్రోగించు తారు. ఇలా మోగించే పుల్ల పేరు- నికోరు పుల్లంటారు. ఇష్టదేవతల ప్రార్థనను ఈ విధంగా ప్రారంభిస్తారు.