పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/654

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


వెళ్ళాడు. అతను మారు వేషంలో వున్న భీమన్నను పట్టుకుని కదిలిస్తూ మాట్లాడతాడు. కోపం వచ్చిన భీమన్న కామన్నను వధిస్తాడు. ఆ కథను ఈ విధంగా పాటలో__

అమ్మో రావమ్మో మము గన్నతల్లో గొబ్బిళ్ళో
నీ ముద్దు తమ్మునకు పాడె గట్టమో గొబ్బిళ్ళో
అందరిండ్ల ముందర వాలాలాడనీ గొబ్బిళ్ళో
భీమన్న ఇంటి ముందర కాకులాడానీ గొబ్బిళ్ళో
భీమన్న ఇంటి ముంద నెత్తురు కాలవలె గొబ్బిళ్ళో

ఇలా ఆ పాట సాగురుంది. గొబ్బి పాటల్లో పౌరాణిక గాథలకు సంబంధించిన పాటలు ఎక్కువ. కొన్ని ప్రాంతాల్లో గొబ్బి గౌరి వ్రతం చేస్తారు. వివిధ కోర్కెలు తీర్చమని, పాటలు పాడతారు.

TeluguVariJanapadaKalarupalu.djvu

సుబ్బీ గొబ్బెమ్మా సుఖము లియ్యవే
చామంతి పువ్వంటి చెల్లెల్నియ్యవే
మొగలి పువ్వంటి మొగుణ్ణియ్యవే.

మొగిలి పువ్వంటి మొగుణ్ణియ్యవే. అంటు తమకు ఉన్నతమైన జీవితాన్ని ప్రసాదించమని కోరుకుంటారు. అలాగే ఇంటి ముందు కళకళలాడే ముగ్గులను వర్ణిస్తూ వాటికి దైవత్వాన్ని ఆపాదిస్తూ

గ్బొబ్బియళ్ళో, గొబ్బి యని పాడారమ్మ
కంచి వరదరాజునే గొబ్బియళ్ళో
గొబ్బియ్యళ్ళో అంచు లంచుల అరుగుల మీద
పంచవన్నె ముగ్గులే గొబ్బియళ్ళో..

అంటూ సాగే పాటల్లో శ్రీ కృష్ణలీలలకు సంబంధించిన పాటలు అనేకం వున్నాయి. ఈ పాటలకూ గొబ్బెమ్మలకు ఈనాడంత ప్రాముఖ్యం లేక పోయినా ఆనాడు అవి ప్రజలను అలరించాయి. ఆ నాటి గొబ్బి ఆట పాటల్లో నృత్యాలలో ఆడపిల్లలు ఓలలాడారు. నాగరికత బలిసిన

TeluguVariJanapadaKalarupalu.djvu

పట్టణాల్లో ఈ కళారూపం కనిపించకుండా పోయినా పల్లె ప్రజలు హృదయాల్లో పదిలంగానే వున్నాయి గొబ్బి పాటలు.