పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/653

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆడపిల్లలు, అనందంగా అందరూ వలయాకారంగా నిలిచి, చప్పట్లు చరుస్తూ పాట పాడుతూ, పాటకు తగినట్లు అడుగులు వేస్తూ, పాట గమనాన్ని బట్టి వేగాన్ని పెంచుతూ గొబ్బి పాటలను వీనుల విందుగా పాడుతూ, తమ భక్తి శ్రద్ధలను వెల్లడిస్తారు. ఇలా ప్రతి ఇంటి ముందూ గొబ్బి పాటలు పాడుతూ వుంటే, బజారంతా శోభాయమానంగా వుంటుంది. అన్నమయ్య లాంటి వాగ్గేయకారులందరూ గొబ్బి పదాలను రచించారంటే వాటి ప్రాముఖ్యాన్ని మన గమనించవచ్చును. రాయలసీమ ప్రాంతంలో పాడుకునే ఒక గొప్ప పదాన్ని గూర్చి, ఈ.ఎల్. ఎస్. చంద్ర శేఖర్ గారు ఇలా వివరిస్తున్నారు.

కంచికి పోయే గాజుల సెట్టి:

రాయల సీమ ప్రాంతంలో పాడుకునే పాటలో కంచికి పోయి వస్తున్న గాజుల శెట్టిని ఓ భక్తురాలు కంచిలో నెలకొన్న దేవతను గురించి అడిగి తెలుసుకునే పాట ఈ విధంగా వుంటుంది.

గొబ్బియాలో కంచికి పోయే గాజుల శెట్టీ
గొబ్బియాలో కంచిలో మాచమ్మ ఎవరాడబిడ్డ
గొబ్బియాలో సింతాకు రాసేటి శివుని బారియ
గొబ్బియాలో మరు భూములే లేటి మంగ మరదాలు
గొబ్బియాలో గాకాకు రాసేటి రాజు కోడలు.

గొబ్బి అనే పదం గర్భా అనే పదం నుంచి ఉద్బవించిందని డాక్టరు బి.రామరాజు గారు, టి దోణప్ప గారు వారి అభిప్రాయాలను వెల్లడించారు. గర్భా అనేది ఒక నృత్య విశేషానికి సంకేతంగా వుంది. గర్భా నృత్యాలు కొన్ని ప్రాంతాలలో ప్రచారంలో వున్నట్లు వినికిడి.

ఏదిఏమైనా గొబ్బిపాటలు మన గేయసాహిత్యంలో స్థానం సంపాదించుకోవటంతో పాటు ప్రముఖ వాగ్గేయకారుల్ని కూడా ఆకర్షించాయి.

కొన్ని గొబ్బి పాటల్లో కథా గేయాలు కూడా వున్నాయి. అలాంటి వాటిలో కామన్న కథను చంద్ర శేఖర్ గారు ఇలా వుదహరించారు.

కామన్న కథ:

కామన్న కథ సారాంశం, కామన్న తన అక్క కుమార్తె ఇంటికి వెళతాడు. తన అక్క కూతురు పట్ల ఆకర్షితుడై కామన్న ఆమెను పట్టుకుంటాడు. ఆమె వాళ్ళన్న భీమన్నకు చెపుతుంది. అతడు చెల్లెలి వేషం ధరించి, కామన్న దగ్గరికి