- ఆదరించిన కర్నూలు నవాబు:
కూచిపూడి వీథి భాగవతులకు గోలుకొండ నవాబు తానీషా ఎలా అగ్రహారాన్ని దానం చేశాడో అదే విధంగా కోటకొండ భాగవతులకు కర్నూలు నవాబు 200 ఎకరాల భూమి శ్రోత్రియంగా ఇచ్చారట. ఆ హక్కు ఈ నాటికి వారి అనుభవంలో వుంది.
వీరి ఇలవేల్పు కౌలుట్ల చెన్న కేశవుడు. వీరి కుటుంబంలోని ప్రతి మగపిల్ల వానికి ఐదవ ఏట ఆ దేవాలయంలో ముక్కు కుట్టిస్తారట. ఆ దేవుని ఎదుట గజ్జె కట్తించి, ప్రథమ పాఠాలు ప్రారంభిస్తారట. విద్య పూర్తికాగానే చెన్న కేశవుని సన్నిధానంలో ప్రథమ ప్రదర్శనం ఇచ్చిన అనంతరంగాని రాజుల వద్ద ప్రదర్శించేవారు కారట. వీరికి ఎక్కువ మక్కువతో అభ్యాసమైన విద్యలు, తరంగాలు, అష్టపదులు క్షేత్రయ్య పదాలు.
- కపట్రాల భాగవతులు:
రెండు వందల సంవత్సరాలకు పూర్వం బనగానిపల్లి నవాబులు కర్నూలు సమీపంలో తుంగభద్రా నదికి అవతల ప్రక్కన అలంపురానికి దగ్గరగా నున్న చారిత్రిక సుందర నగరం కపట్రాల. వీరికి ఇనాముగా యిచ్చారు. ఆనాడే కూచిపూడి నుండి కొంత మంది చల్లా వారు కుటుంబాలతో అక్కడకు వెళ్ళారు. కూచిపూడి సంప్ర