Jump to content

పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/601

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ధ్వన్యనుకరణ పదాల్ని మౌఖికంగా చదివి ప్రయోగాత్మకంగా రుంజపై వాయిస్తారు. బ్రహ్మ, విష్ణు, సరస్వతీ దేవులు స్వరాలను తాళాలను మృదంగాలను వీణలపై చూపగా, మహేశ్వరుడు తాండవ నృత్యం చేశాడని తెలియచేస్తాడు.

శివతాండవం సందర్భంలో డమరుక ధ్వనిని వినిపించి మనోహరంగా హృదయతాండవం చేయిస్తారు. ఈ వాయిద్యపు శబ్దాలు మృదుమధురంగా వుంటాయి. మృదంగ ధ్వనిని అనుకరిస్తారు.

రుంజ వారిలో నిష్ణాతులైన కళాకారులు. ఇదే వాయిద్యాలపైన వివిధ ధ్వనుల్నీ అనుకరించి వాయిస్తారు.

అంతే కాక మిలిటరీ సైనికుల బూట్ల చప్పుడు మాదిరిగానూ, గుఱ్ఱపు కాలి డెక్కల ధ్వని మాదిరిగానూ, మార్చింగ్ బ్యాండు వాయిద్యంగానూ, వీరంగం సమయంలో వాయించే డప్పు ధ్వనులను అత్యద్భుతంగా ఈ రుంజు వాయిద్యంలో వినిపిస్తారు.

తమ రంజ వాయిద్య సందర్భంలో నాద బ్రహ్మను ప్రశంసించే ఈ క్రింది శ్లోకాన్ని కూడ వల్లిస్తారు.

శ్లోకం

చైతన్యం సర్వభూతానాం
నిర్వతిర్జ గదాత్మనాం
నాదబ్రహ్మస్తదానందం
అద్వితీయ ముపాస్మహే.

ఈ విధంగా సంగీతం యొక్క ప్రధాన్యాన్ని ఈ శ్లోకంలో వర్ణిస్తారు. తరువాత రుంజపై చేతితో అత్యద్భుతంగా ధ్వనులను పలికించి ప్రేక్షకులకు ఆనందాన్ని కలుగజేస్తారు.

అవే కాక నాదబ్రహ్మను ప్రణవ స్వరూపాన్నీ, అంబికా స్తవాన్ని సమిష్టిగా రాగయుక్తంగా పాడుతూ, అపూర్వ సమ్మేళనాన్ని వివరిస్తారు.

చెప్పే కథలు:

ఇలా ఒక గంట కాలం అనేక రకాలైన శ్లోకాలతో, పాటలతో వచనాలతో, వివిధ రకాలైన ధ్వనులను వినిపించి, కథను పూర్తి చేస్తారు. వీరు చెప్పే కథల్లో