Jump to content

పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/600

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అంటూ వేగంగా ప్రథమ, ద్వితీయ, తృతీయ, కాలాలలో తాళం వేస్తారు.

2. కిటతక ధిమ్మి కిటతక ధిమ్మి
కిటతక ధింధిమ్మి యనుచు
కకకాంబరుడు మృదంగమును గొల్పి
కిటతక ధిమ్మి యని చేతులతో ఘాతవేసి
తాళము చూపును మృదంగ ధ్వన్యనుకరణ చేయును.

3. సరిగస్స సరిగమ ... పదనిస యని
వాణీ మహాదేవీ వీణమీట

అని తాళము చూపును.

4. కకుందకు ధరికిట తుతుందక యని
వాణీ మహాదేవి శబ్దములు బాడ
తాండవము చేయుచుండె గురుతులు నెలదాల్చు

అని చదివి వివిధ ధ్వనులతో చక్కగా మృదంగ వాయిద్యంలాగా వాయిస్తారని విశేషం రామానుజాచార్యులు గారు నాట్యకళ పత్రికలో ఉదహరించారు.