పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/602

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ముఖ్యమైనవి. మూల స్థంభం, పంచముఖ బ్రహ్మావిర్భావము, పార్వతీ కళ్యాణము మొదలైన కథలను చెప్పటమే కాక, మధ్య మధ్య శ్రావ్వమైన కీర్తనల్నీ పాడుతూ, వాయిద్య నైపుణ్యాన్ని రుంజపై పలికిస్తారు. మాములుగా మన భాగవత కాలక్షేపాలలో, కథాంతంలో, మంగళ సూచికంగా, పవనామాసుతుని బట్టి పాదారవిదములకు అనే పారంపర్యంగా వచ్చే మంగళ హారతినే వీరూ అనుకరిస్తారు.

ఓం హ్రీం రాట్టుకూ మంగళం
ఓం హ్రీ రాట్టుకూ మంగళం
లోకమీసా లోకమనియా
లాకులేక కోక కరుణతో
వాక్కు తెలిసియు వాక్కు చేరవు
రాక లేకను రాకరాకృతి........................ ॥ఓం॥

పంచతత్వ ప్రపంచములను
నది యొంత శిక్షించునో ఘనభువి
పంచదాయ లనేటి పంచ
బ్రహ్మల చాటించి పల్కె.........................॥ఓం॥

ఖ్యాతి కెక్కిన పోతులూరీ
దాతలింగా ప్రణమ బ్రహ్మ
జ్యోతి బింబము కన్న మిక్కిలి
ప్రీతి లేదని నిలిచి కొలిచిన......................॥ఓం॥

రుంజు వాయిద్యకులు త్రేతా యుగానికి చెందిన వారనీ విశ్వకర్మ సృష్టించిన రుద్ర మహేశ్వరుల సంతతి వారనీ ఇతిహాసం తెలియచేస్తూవుంది.

రుంజ కథకులు అక్కడక్కడ మచ్చుకు మాత్రమే కనిపిస్తారు. సర్కారాంధ్ర దేశంలో తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామంలో శ్రీ పాశంపాలలోచనుడు, జీడికంటి సత్యనారాయణ అనే వారు ఈ నాటికీ

రుంజ వాయిద్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. నానాటికి శిధిలమై పోతున్న రుంజ వాయిద్య కళారూపం విశిష్టమైనది. దీనిని పరిరక్షించాల్చిన అవసరం ఎంతో వుంది.