పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/583

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


TeluguVariJanapadaKalarupalu.djvu

హరిదాసుల సంక్రాంతి విన్యాసాలు


తెలుగు ప్రజలకు అన్ని పండగలకంటే మకర సంక్రాంతి చాల పెద్ద పండుగ. అది నెల రోజుల పండుగ, సంవత్సరమంతా కష్టించుకున్న పంట లక్ష్మిని ఇంటికి తెచ్చుకున్న కష్టజీవులైన రైతులందరూ ఆనందోత్సాహాలతో జరుపుకునే పెద్ద పండగ.

సంక్రాంతి శోభలు:

ధనుర్మాసం నెలరోజులూ గ్రామాలన్నీ శోభాయమానంగ్దా వుంటాయి. ప్రతి ఇంటిని అలికి సున్నాలు కొటి సుందరంగా అలంకరిస్తారు. నెలరోజులూ ఇళ్ళముందు రంగు రంగుల రంగ వల్లులను తీర్చి దిద్దుతారు. యువకులందరూ కోడి పందాల సరదాతో కోడి పుంజులను తయారు చేస్తారు.

సంక్రాంతి సంకేతం, హరి దాసులు:

ముఖ్యంగా సంవత్సర కాలంలో ఎప్పుడూ కనిపించని సంక్రాంతి హరి దాసులు కనిపిస్తారు. వీరు ధనుర్మాసం నెలరోజులూ వారి భక్తి పాటలతో ప్రతి ఇంటినీ పావనం చేస్తారు. తెల్ల వారి ఆరుగంటలకే స్నానం చేసి కాషాయ వస్త్రాలను