ధరించి ముఖానికి నామాలు దిద్దుకుని మెడలో పూల దండలను రుద్రాక్ష మాలలను ధరించి నెత్తిమీద నామాలతో అలంకరించిన అక్షయ పాత్రను నెత్తిమీద పెట్టుకుని, భుజంమీద తంబురాను మీటుకుంటూ ఒక చేతితో చిరుతలతో తాళం వేస్తూ శ్రావ్యంగా పాటలు పాడుతూ గజ్జెలు కట్టిన కాళ్ళతో, పాటకు తగిన నృత్యం చేస్తూ హరిలోరంగహరి అంటూ బయలుదేరి ప్రతి ఇంటి ముందూ పాట పాడుతూ నృత్యం చేస్తూ వుంటే, ఇంటి ఇల్లాలు గాని, పిల్లలు గాని, ఫల పుష్పాదులతో దోసెడు బియ్యాన్ని తీసుకువస్తే, హరిదాసు వినమ్రతతో మోకాటి మీద కూర్చుని అక్షయ పాత్రలో వేయించుకుంటూ వారిని పుత్రపౌత్రాభివృద్ధిగా దీవించి మరో ఇంటికి సాగి పోయి, ఇలా వూరంతా పూర్తి చేస్తాడు.
- తన్మయత్వంతో పాడే పాటలు:
ఇలా ఇంటింటికీ తిరుగుతూ తన్మయత్వంతో పాడే పాటల్లో ఎక్కువగా రామదాసు పాటలనే ఇలా పాడేవారు.
అదిగో భద్రాద్రీ, గౌతమి అదిగో చూడండి
ముదముతో సీతా రామముదిత లక్ష్మణల
కలిసి కొలువగా రఘుపతి యుండెడి...................॥అదిగో॥