- బీరప్ప కథ, చుక్కయ్య కథనం:
ముఖ్యంగా మేము చెప్పే కథలు వీరభద్రుని గూర్చి. దీనినే వీరప్ప కథ అని పిలుస్తాం అంటా డాయన. వారి కుల దైవం అయనే గనక అతని పేరు మీద వచ్చే పండగలకు బీరప్ప ఒగ్గు కథలను చెపుతారు. అలాగే మల్లన్న కథలను కూడా చెపుతారు. తెలంగాణా ప్రాంతంలో "వీరప్ప దేవుడు. మల్లన్న దేవుడు" గుళ్ళు వుంటాయి. ముఖ్యంగా ఒగ్గు కథలు చెప్పే (కూర్మ) గొల్ల వారు.అంటే యాదవులు మల్లన్న బీరప్ప కథల్ని పండుగల సందర్భంలో గొల్లవారితోనే చేయించుకుంటాదు. ఇది పారంపర్యంగా వస్తున్న సంప్రదాయం.
బీర్ఫప్ప పండుగ రోజున బీరప్ప యొక్క జీవిత చరిత్రను గురించి ఒగ్గు కథా రూపంలో చెపుతారు. ఒక్క యాదవులే కాక ఇతర కులాలకు చెందిన వారు కూడ ఈ కథను ఎంతో ఆప్యాయతతో చెప్పించుకుంటారు. అంటే ఆ కథ యొక్క విశిష్టత అంతటిది. ఆ కళారూపం యొక్క గొప్పతనమది.
- ఒగ్గు కథకు ఈ పేరెలా వచ్చింది?
వీరభద్రుడూ, మల్లిఖార్జునుడు వీరి చేతుల్లో వుండే వాయిద్యం డమరుకం ( అంటే జగ్గు) ధరించేవారు. చుక్క సత్తయ్య గారి పెద్దలు, రెండు వందల సంవత్స