పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/562

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాల క్రితం మల్లిఖార్జునుడు ఇచ్చినటువంటి గొఱ్ఱెలను కాచుకుంటూ ఈ జగ్గుపైనే, అడవులలో చెట్ల క్రింద ఒగ్గు కథలు చెప్పేవారట. రాను రాను ఈ జగ్గుతో చెప్పే బగ్గుకథ ఒగ్గుకథగా రూపాంతరం చెందింది.

తాతలు చెప్పిన కథలు:

ఈ ఒగ్గు కథలు ఈ నాటి కళాకారులు వ్రాసిన కథలు కావు. వీరి తండ్రులు చెప్పిన కథలు వీరు చెపుతున్నారు. వీరి తండ్రులకు తాతలకు వీరి తాతలు చెప్పిన కథలివి.

ముఖ్యంగా ఒగ్గు కథలు చెప్పే వారి వృత్తి గొఱ్ఱెలను కాయడం. నిపుణులైన వారు ఒగ్గు కథలు చెప్పడం, ముఖ్యంగా వీరు కథను ప్రారంభించే ముందు డోలును వాయిస్తూ, వీరణంతో శబ్దం చేస్తూ డమరుకంతో దడ దడ లాడిస్తూ గంగా దేవిని ప్రప్రథమంగా ప్రార్థిస్తారు.

కథా బృందం:

ఈ ఒగ్గు కథలు చెప్పే వారు అయిదు నుంచి పది మంది వరకూ వుంటారు. అయితే ఇంత మంది వుండాలనే నబంధా లేదు. వారి వారి సౌలభ్యాన్ని బట్టి బృందాలను ఎర్పాటు చేసుకోవచ్చు. ముఖ్యంగా కథకు కనీసం అయిగురు సభ్యులైనా వుండాలి. ఈ అయిదుగురిలో ఒకరు ప్రధాన కథకుడు. మరొకరు సహాయకుడు. వీరిద్దరూ ముందు భాగంలో వుంటారు. వారి వెనుక భాగంలో ముగ్గురు నిలబడతారు. వారిలో ఒకరు డోలు, మరొకరు తాళం, ఇంకొకరు కంజిరా ధరిస్తారు. వీరందరూ ఒక వంక వాయిద్యాన్ని సాగిస్తూ వంత గానాన్ని కూడ అందుకుంటారు. ప్రధాన కథకుడు సందర్భాన్ని బట్టి ఆ యా పాత్రలు ధరిస్తూ కథాగానం చేస్తూ వుంటాడు. వంత దారుడు కూడ పాత్ర ధారణలో సందర్భాన్ని బట్టి సహకరిస్తూ వుంటాడు. వీరిరువురూ పాత్రానుగుణ్యంగా కొంత కొంత ఆహారాన్ని మారుస్తూ వుంటారు. అయితే ఈ ఆహారం మార్పుల్లో కథ ఏమాత్రం కుంటుపడదు.

స్త్రీ వేషం:

ప్రథాన కథకుడే చీర కట్టి, కొప్పు పెట్టి,ముత్తైదువుగా స్త్రీ పాత్రను ధరిస్తాడు. ఇప్పటి వరకూ ఈ కథ తెలంగాణా హద్దులు దాటి లేదు. కథనంలో ముఖ్య కథకుడు,