Jump to content

పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/552

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వీరశైవపు వీరముష్ఠి వారు

ఈ నాటికీ బిక్షుకులై తిరిగే వీరముష్ఠి వారు ఆంధ్రదేశంలో అన్ని ప్రాంతాలలోనూ వున్నారు. ఏనాడు వీరశైవం ఏయే ప్రాంతాల్లో విజృంభించిందో ఆనాటి నుంచీ ఈ వీరముష్టులు ప్రచారలో వున్నారు.

వీరముష్టి, వీరభట, భద్ర పాద మొదలైన పేర్లన్నీ వీర ముష్టులకు చెందుతాయి. ముష్టి అంటే పిడికిలి అనీ, వీరులైన యోధులనీ, వీరభిక్షుకులనీ, వీరశైవ భిక్షుకులనీ, వీరముష్టి వారికి అర్థం చెప్పు వచ్చునని డా॥ బి. రామరాజు గారు వారి జానపద గేయ సాహిత్యంలో ఉదహరించారు.

వీరు వీరశైవ వాఙ్మయానికి సంబంధించిన గేయాలనూ, శైవభక్తుల గాధలనూ, కన్యకా పరమేశ్వరీ కథలనూ చెపుతూ వుంటారు. వీరు ముఖ్యంగా శైవభక్తులైన జంగాలనూ, వైశ్యులనూ ఎక్కువగా యాచిస్తారు. కాని ఈనాడు వారు అక్కడక్కడా వున్న కొద్ది మంది అందరినీ యాచిస్తున్నారు.

ఒకప్పుడు వీరు ఎవరినైతే యాచించే వారో వారే వీరిని మక్కువగా ఆదరించే వారు.

ముఖ్యంగా వీరు వైశ్యులనే ఎందుకు యాచిస్తారో రామరాజు గారొక ఇతిహాసాన్ని ఈ విధంగా తెలియచేస్తున్నారు.

వీర ముష్టులు వైశ్యులకు ఇలవేల్పైన కన్యకను, రాజరాజు బలాత్కరించి పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఆయన సైన్యంలో నున్న వీరముష్టులూ, ఆయన పల్లకీని మోసే బోయలుగా వున్న వీరముష్టులు కావాలని కొంత ఆలస్యం చేయటం వల్ల