పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/553

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కన్యకా, ఆమె వంశీయులూ అగ్ని గుండంలో ఆహుతి అవటానికి అవకాశం చిక్కీందనీ, అలా ఆలస్యమే చేయకపోయినట్లైతే, కన్యకను రాజరాజు చెరబట్టి వుండే వాడనీ, ఈ విధాన వీరముష్టులు వైశ్య జాతికి మహోపకారం చేశారనీ, ఈ కారణాన వైశ్యులు వీరముష్టులను గౌరవించి వారికి పారితోషికములు ఇస్తారనీ ఐతిహ్యం.

వీరముష్టులు గానం చేసే పాటలన్నీ కన్యకా ఇతి వృత్తానికే సంబంధించిన వని "అయ్యల రాజు నారాయణా మాత్యుడు" వీర ముష్టులను గురించి ఆయా రచనలో ఉదహరించాడు.

వీరముష్టుల యొక్క జన్మ వృత్తాంతం గురించి ఒక వింత కథ ప్రదారంలో వున్నట్లు కూడ రామరాజు గారు వివారిస్తున్నారు. ఎప్పుడో వీరభద్రుడు దక్షాధ్వర, ధ్వంసము చేసే సమయంలో, వీరభద్రుని శరీరంనుంచి స్రవించిన చెమట నుండి ఈ జాతివారు జన్మించారట. వీరభద్ర, భిక్షుకు, విభూతి పిండాల వంటి గోత్ర నామాలు వీరశైవాన్ని చెపుతూ వున్నాయి. వీరిలో కొంత మంది జంగాలుగా మారారు. వీరముష్టులకు గురువులు ఆరాధ్య బ్రాహ్మణులని చెపుతారు. వీరముష్టులు మారెమ్మ, ముత్యాలమ్మ, పోచమ్మ మొదలైన గ్రామదేవతలను కూడ పూజిస్తారు.

ముఖ్యంగా వీరు గంభీర ధ్వని నిచ్చే జేగంట శంఖం, తప్పెటా వాయిస్తూ భిక్షమెత్తుతారు. వీరముష్టుల్లో ఆవేశ పరులైన కొందరు బుగ్గలకు నారసాలను పొడుచుకోవడం, నాలుకల్ని తెగకోసుకోవడం మొదలైన భయంకరమైన ఆవేశాన్ని ప్రదర్శి