పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/539

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈ చెంచు పాటల ద్వారా రెండవ ప్రపంచ యుద్ధకాలంలోఫాసిస్టు మూకల క్రూరకృత్యాలను ప్రజానాట్య మండలి కళాకారులు, నాజరు దళంలోని, రామకోటి, పురుషోత్తం మొదలైన వారు ఎంతో వుత్తేజంగా పాడి ప్రజలకు ఫాసిస్టు ప్రమాదాన్ని గురించి, యుద్ధ ప్రమాదాన్ని గురించి వివరించారు.

ఇదే చెంచు పాటల్లో బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడ లాడించిన అల్లూరు సీతారామరాజు మన్యంలో జరిపిన పోరాట చరిత్రను మిక్కిలినేని, మాచినేని, మొదలైన వారు ఉత్తేజంగా పాడి ప్రజలను వుత్తేజపర్చారు.

అదే చెంచు పాట బాణీలో విజయవాడ తాలూకా, నంది గామ వాస్తవ్యులు అయ్యపు వెంకట కృష్ణయ్య గారు భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో ప్రాణాలర్పించిన స్వాతంత్ర్య సమర వీరుల త్యాగాలను గురించి ఈ విధంగా వివరించారు. చెంచుల పాట బాణీలో

మనది భారత దేశమమ్మా
మనది భార జాతి తల్లీ.............॥నందానా॥
భారతీయులము మనమమ్మ..........॥నందానా॥
బానిసలమైనాము తల్లీ..............॥నందానా॥
భోగాల పుట్టినిల్లమ్మ
భూలోక స్వర్గమే తల్లీ
మన ఖడ్గ తిక్కనా
మన్యంపు వీరులూ
మన రెడ్డి రాజూలూ
రాణా ప్రతాపుడూ
రసపుత్ర వీరులూ
తమ శౌర్యమయ రక్త
ధారా స్రవంతిలో
తడిపి మెదిపిన వీర
ధాత్రీ ఇది మాతల్లి. ॥మనది॥

ఇలా దేశం కోసం ప్రాణాలర్పించిన వీరులందరినీ, స్మరిస్తూ చెంచు పాటలతో ఉర్రూతలూగించే వారు ప్రజానాట్యమండలి కళాకారులు.