Jump to content

పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/538

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆడందం ఆరిపోను
ఆడి సోకు మాడి పోను
ఆడి బ్రతుకు కాలి పోను
ఆడి జన్మ ఆరిపోను........ ॥లాయరమ్మ లాయరో
                                  లాయరమ్మ లాయరో॥.


అంటూ ప్రజలను వినోదపరుస్తూ, మరొ ప్రక్క విజ్ఞానపర్చేవారు. ఇది నాటి ప్రజా నాట్య మండలి కానుక.


చెంచులు చెప్పే శ్రీరంగ నీతులు

 ఏ వూరు ఏ భామ..........॥నందానా॥
ఎవ్వారి భామవేవై భామా ......॥నందానా॥
వినరో నరసిమ్మ.........................॥నందానా॥
ఉండు గూడెం మాది....................॥నందానా॥
చేతిడే ముద్దమ్మ........................॥నందానా॥
చెయ్యెత్తి దానాలు.......................॥నందానా॥
వడ్డిచ్చే తల్లి వడ్డిచ్చె తల్లి.

అంటూ భద్రాచల ప్రాంతాల నుండి ఆంధ్ర దేశానికి అప్పుడప్పుడు వచ్చి యాచించి వెళ్ళిపోతూ వుంటారు చెంచులు. వెంట తెచ్చిన నెమలి ఈకలు, పులి గోరులు, మూలికలు అమ్ముకుని డబ్బు చేసుకుంటారు.

వీరు పాడే పాట బెంబీత పాట అంటారు. వీరు ముగ్గురు నలుగురు కలిసి జట్లుగా వస్తారు. ఒకరు చరణం పాడితే మిగిలిన వారు చరాణంలో జెంబీతా అనీ, తందానా అనీ శృతి కలుపుతారు. అందరూ చిన్న జేగంటలను చేత పట్టుకుని, ఒక పుల్లతో పాడే పాటకకు తాళంగా ఉపయోగిస్తారు. వీరి వేషధారణ, కాళ్ళకు చాలీచాలని తొడిగిన లాగులు యాచలలో సంపాదించిన చొక్కాలూ, పూల దండలూ, తల పాగాలూ, పాగాలపై నెమిలి ఈకలూ, పులి గోరులూ, పంది కోరలూ మొదలైన వాటిని ధరిస్తారు.