పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/522

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


వీథిలో ఎదురుగడ:

వీరు ఒక గ్రామంలో ప్రవేశించి పెద్దలందర్నీ కలుసుకుని ప్రదర్శనానికి అనుమతి తీసుకుని, వారిని ప్రదర్శనానికి ఆహ్వానించి, ఊరి మధ్య ఒక పెద్ద ఎదురుగడను పాతుతారు. దానిని నాలుగు ప్రక్కలా నాలుగు బలమైన త్రాళ్ళతో లాగి నిలబెడతారు. వారి దగ్గరున్న డోలును ఉధృతంగా వాయిస్తూ వుంటే, చిన్న పిల్లలు రక రకాల పిల్లి మొగ్గలు వేస్తూ వుంటారు. ఒక్క పదినిముషాల్లో ఊరిలోని వారందరూ గుమి కూడతారు. అప్పుడు ప్రదర్శనం ప్రారంభిస్తారు. ఇది చూడడానికి ఒక వ్వాయామ ప్రదర్శనంగా కనిపించినా, దీనిని ఒక కళా రూపంగానే భావించి ప్రజలు ఆనందం పొందుతారు.

TeluguVariJanapadaKalarupalu.djvu

యవ్వనంలో వున్న యువతుల పిల్లి మొగ్గలకూ, చేసే విన్యాసాలకూ, యువకులు తల్ల క్రిందులై పోతారు. ఆట ప్రారంభానికి వంతగా నున్న డప్పు, డోలూ ఎంతో ఉత్సాహాన్నిస్తాయి. కేరింతలతో, కేకలతో, ఆడా, మగా, గోచీలు పెట్టి దండాలూ, జబ్బలూ, చరుస్తూ అందరూ రకరకాల మొగ్గలు వేస్తూ ప్రేక్షకులను ఆకర్షిస్తారు; గారడీ నాయకుడు కొట్టే డోలుకూ, వేసే కేకలకూ అనుగుణంగా రకరకాల విన్యాసాలు చేస్తారు. ముఖ్యంగా స్త్రీలు ఎత్తుగా వున్న తీగ మీద ఎదురుగడ బ్యాలెన్సుతో ఆ ప్రక్క నుంచి ఈ ప్రక్కకు, ప్రథమంలో నెమ్మదిగా నడుస్తూ, తరువాత వేగంగా నడుస్తూ, తీగ మీద నుండి క్రిందికి పడి పోతుందేమో నన్నంత భయాన్ని కలిగిస్తూ తమ తమ నైపుణ్యాన్ని చూపిస్తారు.

గడమీద గిరికీలు:

ఆ తరువాత ఎత్తుగా వున్న స్త్రీ, పురుషుడూ కూడా గబగబా పైకి ఎగ బ్రాకి, శిఖరాగ్రం మీద నిలబడీ, కూర్చునీ, పడుకునీ రకరకాల ఆశ్చర్యకరమైన విన్యా