పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/523

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


TeluguVariJanapadaKalarupalu.djvu

సాలను చేస్తూ చూపరుల్ని, సంభ్రమాశ్చర్యాలతో ముంచుతారు. అక్కడనుండీ పల్టీ కొట్టి ఎదురుగడకు కట్టిన త్రాటి మీద నుండి ఒక్క నిముషంలో వేగంగా జారి క్రిందికి వస్తారు. అఖరి సారిగా గడ మీదకు స్త్రీ ఎగబ్రాకి గిర్రున తిరుగుతూ, తన చాతుర్యాన్ని చూపిస్తుంది. చుట్టూ చేరిన ప్రేక్షకులందరూ, తలలు పైకెత్తి ఈలలతో చప్పట్లుతో, గడసానిని మరింత ఉత్సాహపరచి ఆనందంలో, ఓలలాడి పోతారు. ఇలా ముగ్దులై పోయిన ప్రేక్షకులను గారడి బృందంలో వున్న పిల్లలూ, పెద్దలూ బాగా డబ్బు దండు కుంటారు. ఇలా ఒకనాడు దొమ్మరాటలు , ఆంధ్ర ప్రజా సామాన్యాన్ని ఉర్రూత లూగించాయి. ఈనాటికీ అక్కడక్కడా చిన్న చిన్న బృందాలను చూడగలం. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక చిన్న తరహా సర్కసు, అయినా గడ సాని గడ నెక్కడం ఊరికి మంచిదనే నమ్మకం పల్లె ప్రజలలో వుంది.

కనికట్టు చేసే కాటిపాపల వాళ్ళు

TeluguVariJanapadaKalarupalu.djvu

కాటి పాపల వారు ఆంధ్ర ప్రాంతంలో కూడా వున్నారు. ఈ కాటిపాపల వారు, మెదక్, జిల్లా జహీరా బాద్ తాలూకాలో వున్నారు. కాని ఈనాడు ఆంధ్రదేశంలో కాటి పాపల వారిని గురించి ఎవరికీ తెలుయదు.

వీరిని అందరూ కాటిపాపల వాళ్ళు అంటారు. ఇలా పేరు ఎందుకు వచ్చిందంటే ఎవరూ చెప్పలేరు. కానీ వీరి అసలు పేరు కాటికాపర్లు. వీరి అసలు వృత్తి (కాటిని) శ్మశాన్ని కాపలా కాయడమనీ అందువల్లే వారికా పేరు వచ్చిందనీ, లక్ష్మీకాంత మోహన్ గారు తెలియ జేస్తున్నారు. పూర్వం ఊరి కాపలా వారి మాదిరి కాటి కాపర్లు కూడ వుండే వారు. వీరికి ఊరు వుమ్మడిగా పారితోషికం ఇవ్వబడేది.

అయితే నా చిన్న తనంలో పిల్లల్ని భయ పెట్టటానికి తల్లి దండ్రులు అదుగో కాటి పాపల వాళ్ళు వచ్చారంట అనేవారు. కాటి పాపల వాళ్ళు పిల్లల్నీ పాపల్నీ ఎత్తుకు