పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/521

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈనాడు - వీరి ఆలనా, పాలనా చూసే వారే లేరు. వీరిని గురించి అలోచించే వారే లేరు. పట్టించు కోవాల్సిన ప్రభుత్వం సంగతి చెప్ప వలసిన అవసర మేమి లేదు.

నిజానికి పజ్ఞ, ప్రతిభా విశేషాలతో కూడు కొని వున్న ఇలాంటి కళా రూపాలు చచ్చి పోకూడదు.

వాటిని బ్రతికించు కోవాల్సిన అవసరం ఎంతైనా వుంది. ఎందు కంటే, అవి జాతీయ క్రీడా విశేషాలకు సంబంధించిన కళారూపాలు గనుక.

సహజంగా ఈ నాటి దొమ్మర్లు, పంటలు బాగా పండిన తరుణంలో, సంక్రాంతి మొదలైన పర్వదినాలలో దొమ్మరాటల వారు వస్తూ వుంటారు. వంశ పారంపర్యంగా కుల వృత్తిగా స్వీకరించి కుటుంబంలో వున్న వారందరూ చిన్న తనం నుంచే వీటిని అభ్యసించడం వల్ల, కుటుంబ సభ్యులందరూ ఆరితేరినవారై వుంటారు. ముఖ్యంగా వీరి ఆటల్లో మంచి వయసులో వున్న స్త్రీలు ఇద్దరు ముగ్గురుంటారు. ఈ ఆటలకు వీరే ముఖ్య ఆకర్షణ.