Jump to content

పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/520

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అని ఊర్వసి పేర్కొన్న గడసాని ఇటువంటిదే అని నాచన సోముని ఉత్తర హరి వంశ 1-74 పద్యంలో ఉదహరింప బడిందని.... (పి.యస్.ఆర్. అప్పారావు గారు, సూత్ర ధారి పత్రికలో వుదయరించారు. )

విజయనగర రాజుల కాలంలో మహర్నవమీ వుత్సవాలలో దొమ్మరాటలు మొదలైన చిత్ర విచిత్రాలను ప్రదర్శించడంతో పాటు ఏనుగులు, పులులు, సింహాలు మొదలైన క్రూర మృగాలతో సర్కసు పనులు చేయించే వారని విదేశీ యాత్రీకుడైన అబ్దుల్ రజాక్ వర్ణించి నట్లు భావరాజు కృష్ణారావుగారు (విదేశీ యాత్రికులు -- ప్రాచీనాంధ్ర దేశం 191 - 192 పేజీలలో) ఉదహరించారు.

అంతే కాక బాపల విద్య లేవీ కూడ దొమ్మరి విద్యలతో సరిపోవని చంద్ర శేఖరుడు తన శతకంలో ఈవిధంగా వర్నించాడు.

మెడ్డుగ దొమ్మరెక్క, గన
మించిన యిద్దమ రేడ లేదు, నా
తెడ్డొక బాప నిద్దెలని
తిట్టును మూర్ఖుడు చంద్ర శేఖరా.

ఈ విధంగా దొమ్మరాటలు చరిత్రలో స్థానాన్ని ఏర్పరచుకున్నాయి. ఈ నాడు పెద్ద పెద్ద సర్కసులని చెప్పుకోబడే వాటికి ఆధారం ఆనాటి దొమ్మరాటలే __

నేటి దొమ్మరాటలు:

ఆయా కాలాలలో చారిత్రకంగా ప్రచారం పొందిన దొమ్మరాటలు, ఈ నాటికీ ఆంధ్ర దేశంలో అక్కడక్కడా దేశ దిమ్మరులైన దొమ్మరుల ద్వారా చూస్తూ వుంటాం. ఒకప్పుడు ప్రజ్ఞ విశేషాలను ప్రదర్శించే సమూహాలుగా వున్న ఈ దొమ్మరి వారు కేవలం ఒకే కుటుంబంలో వున్న వ్వక్తులే. వారి జీవనాధారం కోసం చిన్న చిన్న ప్రదర్శనాల నిచ్చి వచ్చిన డబ్బుతో కడుపు నింపు కుంటూ, ఒక వూరి నుంచి మరో వూరికి పోతూ వుంటారు. ఒకప్పుడు రాజాస్థానాలలో ప్రభువుల సమక్షంలో ప్రతిభా విశేషాలను చూపించిన వీరు బిక్కు బిక్కు మంటూ దిక్కులేని యాచకుల్లాగ బ్రతుకు తున్నారు.