మార్పుల ననుసరించి, వారికి అభిరుచి గల విషయాలను చెపుతూ, వారితో ఆమోదింప చేస్తూ, భవిష్యత్ వర్తమానాల గురించి జోశ్యం చెపుతూ పోయిన వారి ఆత్మ శాంతికి ముడుపులు కట్టించుకుంటూ, వారి వారి సందేహాల నివృత్తి కొరకు ఓపికగా సమాధానాలు చెపుతూ, జరిగిందీ, జరగబోయేదీ చెపుతూ వినేవారి కళ్ళ వెంట నీరు కార్పిస్తూ, తాను చెప్పిన విషయాలతో వారిని తన్మయుల్ని చేస్తూ, శ్రోతల యొక్క అనుభూతినీ, సాను భూతినీ అనుసరించి సోదెమ్మి, చేర్పులూ, కూర్పులూ కలిపి, రసవత్తరంగా సోదె ముగుస్తుంది ... చాటలో బియ్యం పావలా డబ్బులు కాక, వారి సంతోషం కొద్దీ ఎక్కువ ముట్ట చెపుతారు.
- పుట్టు పూర్వోత్తరాలు:
వెంకటేశ్వర విశ్వ విద్యాలయం సామాజిక మానవ విజ్ఞానానికి చెందిన డా॥ జి.వి. సుబ్బా రెడ్డి గారి కథనాన్ని బట్టి, దక్షిణ భారత దేశంలో, దక్షిణాగ్రం నుంచి ... ఉత్తరార్కాటు జిల్లాలు దాటి ఉత్తరంగా వీరు వ్వాపించి వుండే వారనీ, వీరిని ఎరుకల వాళ్ళనీ, కోర్బా వాళ్ళనీ పిలుస్తారనీ అంటారు.
ఎరుకల వారిలో ఏడు ఉప తెగ లున్నాయి. వెదురు బుట్టలల్లడం, పిట్టలు పట్టడం, ఉప్పు అమ్మకం, మంచాలకు నులక పేనడం, పాముల చర్మాలు తీయటం