పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/518

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మొదలైన పనులు పురుషులు చేస్తూ వుంటారు. స్వాతంత్ర్యానికి పూర్వం ఎరుకల వారు నేరస్థుల జాబితాలో వుండే వారు. స్వాతంత్ర్యానంతరం, షెడ్యూల్డ్ తెగలుగా గుర్తించటం జరిగింది.

దేశ దిమ్మరులు:

వీరు దేశ దిమ్మరులు, ఒక గ్రామం నుండి మరో గ్రామానికి సంసారాలతో సంచారం చేస్తూ వుంట్ఘారు. మరి కొంత మంది స్థిర నివాసాలు ఎర్పాటు చేసుకున్నారు. పైన వుదహరించిన ఏడు తెగలకు చెందిన ఎరుకల వారు, కడపకు మూడు కిలో మీటర్ల దూరంలో, దండు హరిజన వాడ ప్రక్కన

కమాలపురం గూడెంలో ప్రభుత్వం నిర్మించిన ఇళ్ళలో నివసిస్తున్నారు. ఈ గూడెంలో నలబై కుటుంబాల వారున్నారు. అమాయక జీవులు అల్ప సంతోషులు. పూటకు అన్నం దొరికితే పరమానంద పడిపోతారు.