పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/516

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


కలిగిన పుల్లను పట్టుకుంటారు. ముఖాన పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకుని వయ్యారంగా వీధిలో నడుస్తూ చూపరులకు ఏవో అతీత శక్తులు కలిగిన స్త్రీ దేవతా మూర్తిగా కనిపిస్తుంది.

ఎవరీ అమ్మ పిలుస్తుంది:

ఇంతలో ఎవరో ఒక అమ్మ ఓ సోదమ్మీ అని పిలుస్తుంది... దానితో అమ్మలక్క లందరూ చుట్టూ మూగుతారు. సోదెలమ్మి చాటలో బియ్యం పోయించుకుని, పసుపు కుంకాలను వారగా పెట్టించి, పావలా డబ్బులు ప్రక్కన పెట్టించి, వాక్కు నెచ్చే ఇలవేల్పు, గవ్వల పలకను ముందుంచి, కూన రాగం తీస్తూ, వెండి కట్టుల పుల్లను ఇల వేల్పుకు

TeluguVariJanapadaKalarupalu.djvu

తాకించి, అమ్మా పలుకు, జగదంబా పలుకు, మాయమ్మ పలుకు, కంచి కామాక్షమ్మ పలుకు, మధురమీనాక్షీ పలుకు, విశాలాక్ష్మి పలుకు, విజయవాడ కనక దుర్గమ్మా పలుకు, పెనుగంచి ప్రోలు తిరుపతమ్మ పలుకు, వుయ్యూరు వీరమ్మా పలుకు పలకవే తల్లి అని దేవత లందర్నీ కళ్ళు మూసుకుని భక్తి భావంతో స్తుతించి, చేతిలో వున్న పుల్లను చెప్పించుకునే వారి చేతిలో పొడుస్తూ; ఇంటా, బొట్టా, తోడా, నీడా గడ్డమా అంటూ సోది చెప్పించుకునే వారు బంధువుల తాలూకు ఆత్మలను తన ద్వారా పలికేటట్లు చేసి పోయిన వారి ఆశలు అడియాసలు చెపుతూ, సంతోషకరమైన విషయలౌ చెప్పేటప్పుడు, సంతోషంగానూ, విచారకరమైన విషయాలు చెప్పేటప్పుడు దీనాతి దీనంగా హృదయాలను ద్రవింపచేసే విధంగానూ, కొన్ని ఆసక్తికరమైన విషయాలనూ, కొన్ని ఆశను రేకెత్తించేవి గానూ, మరి కొన్ని అత్యాశను కలిగించేవి గాను మరి కొన్ని వారి వారి మనసుల్లో ఎముందో అదే భావాన్ని చెపుతూ వినే వారి