పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/515

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ఎరుక ఎరుకలగా మారి, అది ఒక జాతి పేరుగా, ఎరుకల జాతియై, ఎరుకల వాళ్ళుగా ప్రఖ్యాతి వహించారు. ఎరుక చెప్పే వారి జీవిత భవిష్యత్తు ఏమిటో ఎరుకల వారికి తెలియక పోయినా, ఇతరులకు మాత్రం ఎరుక చెప్పి జీవిస్తున్నారు.

వెంకన్న సోది వేషం:

సోది మీద నమ్మకం, రాజులకూ, జమీదారులకు, సామాన్య ప్రజలకూ పరిమితం కాక, దేవుళ్ళను కూడ అది ఆకర్షించిందంటే, అది ఎంతటి బలవత్తరమైందో వూహించ వచ్చు. ఉదాహరణకు తిరుపతి వెంకటేశ్వర స్వామి. శ్రీనివాసుడు కూడా తన ప్రియురాలు పద్మావతి దగ్గరకు ఎరుక చెప్పే వేషంతో వెళ్ళి, ఆమెకు గద్దె చెప్పినట్లు నటిస్తూ పద్మావతికి శ్రీనివాసుని పట్ల అనురాగం కలిగించి చివరికి పద్మావతిని వేంకటేశ్వరుడు వివాహం చేసుకున్న ఘట్టం అందరికీ తెలిసిందే, దీనిని బట్టి సోదె ప్రక్రియ ఎంతటి బలవత్తరమైందో అర్థం చేసుకోవచ్చు.

కష్టాలు, సుఖాలూ:

ప్రతి మనిషీ సుఖాలు వచ్చి నప్పుడు ఏ జాతకాలు చూపించు కోక పోయినా, కష్టాలు వచ్చి నప్పుడు మాత్రం జాతకాలూ, జ్యోతిషమూ, సాముద్రికమూ సోదె చెప్పించు కోవడమూ, చిలక జోశ్యమూ, కోయవారు పలుకులు వినీ తృప్తి పడుతూ వుంటారు.

సహజంగా ప్రతి వారూ పుట్టినప్పుడే పుట్టిన ప్రతి వారికీ బ్రహ్మ ముఖాన వ్రాస్తాడంటారు. అయినా మనసు నిబ్బరం లేక, కష్టాలను తట్టుకోలేక ఎవరు ఏ మంచి వార్థ చెపుతారో యని మగ వారెవరూ ఇంట లేనప్పుడు, స్త్రీలంతా కూర్చుని మంచి చెప్పేటప్పుడు సంతోషిస్తూ, చెడు చెప్పేటప్పుడు ముక్కులు చీదుతూ వుంటారు.

సోదెమ్మ, సోదో:

సోదెమ్మ సోదో అంటూ, నెత్తి మీద ఒక బుట్ట పెట్టు కుంటారు. ఆ బుట్టలో, నాలుగు పలకలు గల గవ్వలతో కుట్టిన ఒక వస్తువుంటుంది. దానినే వాక్కు నిచ్చే దేవతగా ఆరాధిస్తారు. ఆ దేవతను, పసుపు కుంకాలతో అలంకరిస్తారు. ఒక చేతిలో తంబురా, చంకలో పిల్లవాడు, మరో చేతిలో వెండి కట్టలు గల మంత్ర శక్తి