Jump to content

పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/514

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఎరుకలు చెప్పే ఎరుకోయమ్మ, ఎరుక


ఒకనాడు కురవంజి రాజాస్థానాలలో రాణి వాసపు స్త్రీలకు ఎరుక చెప్పేది కురవ జాతికి చెందిన వారవటం వల్ల వారిని కురవంజి అని పిలిచే వారు. వారే ఈనాడు ప్రతి పల్లెలోనూ సోదోయమ్మ సోది, సోదడగరమ్మ సోది అంటూ వీథి వీథి తిరుగుతూ వుంటారు.

భవిష్యత్తు కోసం:

ప్రతి మనిషికీ తన భవిష్యత్తును గురించి తెలుసుకోవాలనే ఆరాటం సామాన్యంగా వుంటుంది. ప్రస్తుతం విజ్ఞాన శాస్త్ర విజయాల వల్లా, సామాజిక విశ్లేషణం వల్లా కాస్త తగ్గినా పూర్తిగా పోలేదు. బిడ్డ పుట్టిన రోజే జాతకం వ్రాయించే వారు ఎంతో మంది వున్నారు. పూర్వ రాజులకూ, సంస్థానపతులకూ, జమీందార్లకూ, అస్థాన జ్యోతిష్కులు వుండేవారు. ఈ కార్యం ప్రారంభించాలన్నా జ్యోతిష్కుల అభిప్రాయం తీసు కోకుండా ఏ పనీ చేసే వారు కారు. జ్యోతిష్కులు రాజాస్థానాలకు పరిమితమై పోయారు.

ఎరుకల జోశ్యమే పేదలకు:

జ్యోతిష్కులు రాజాస్థానాలకు పరిమితమైతే పేదలకంతా ఎరుకల స్త్రీలే సోదె ద్వారా వారి వారి భవిష్యత్తును చెపుతూ వుంటారు. సోదెల వారి మాదిరే కోయ దొరలు కూడ పేదలకు జోస్యం చెపుతూ వుంటారు. ఎరుకోయమ్మ ఎరుకో అంటూ వీథుల్లో వెళుతూ పిలిచిన వారికంతా ఎరుక చెపుతూ వుంటారు. ఎరుకంటే వారికి తెలిసింది చెప్పటం, చెప్పటమంటే, భవిష్యత్తును గురించి చెప్ప గల వారు గనుక, వారిని ఎరుక వాళ్ళు అని అంటారు. అయితే ఇది రూపాంతరం చెంది,