పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/509

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉపయోగిస్తారు. తొండ చర్మాన్ని స్వర పేటికపై బిగిస్తారు. 12 నుంచి 16 అంగుళాల వెదురును ఒక చివర కొబ్బరి చిప్పను మేకుతో బిగిస్తారు. వెదురుకు రెండవ చివరన రెండు మేకులు త్రిప్పడానికి వీలుగా వుంటాయి. స్వర పేటికపైన సన్నని కొయ్య ముక్కను వుంచి, దానిపై నుండి రెండు తీగలను మేకులకు కట్టి ఉంచుతారు. మేకులను త్రిప్పడం ద్వారా తీగబిగుతును ఎక్కువ చేయవచ్చు. విల్లువలె తయారు చేసిన కమానుతో ఈ వాయిద్యాన్ని వాయిస్తారు.

పారా:
సామూహిక నృత్యం

ఇది మద్దెల వంటి పొడవు మాత్రం రెండు అడుగులు వుంటుంది. దీనికి కూడ రెండు వైపులా మేక చర్మాన్నే బిగించి వుంచుతారు. రెండు వైపులా వ్రేళ్ళతోనే వాయించు తారు. అదిలాబాదు జిల్లా రాజా గోండులు ఈ వాయిద్యాన్ని ఉపయోగిస్తారు.


వాయుజన్య శబ్ద వాయిద్యాలు


నాగస్వరం:

ఎరుకలలో ఒక కులమైన పాముల వాళ్ళు వాయించే వాద్యమిది. పాములను ఆడించడానికి ఇది ఉపయోగ పడుతుంది. త్రాచువంటి పాములను సైతం పాముల వాళ్ళు నాగ స్వరంతో మచ్చిక చేస్తారు.