పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/508

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వాయిస్తారు. ముఖ్యంగా దింసా నృత్యాలలో దినిని ఉపయోగిస్తారు. సామంత జాతివారూ, గోండులూ ఈ వాయిద్యాన్ని ఎక్కువగా వాడుతారు.

వెట్టె లేక, తురుబులి:

అదిలాబాదు జిల్లా గోండులు ఉపయోగించే వాయిద్యమిది. దీనిని తురుబులి అనీ, వెట్టె అనీ అంటారు. కుండ మట్టితో గాని ఇనుముతో గాని, కొయ్యతో గాని దీనిని పళ్ళెం తయారు చేసి పైన చర్మాన్ని బిగిస్తారు. ఈ చర్మం వ్వాసం సాధారణంగా పది అంగుళాల కంటే ఎక్కువే వుంటుంది. సన్నని రెండు పుల్లలతో దీనిని వాయిస్తారు.

డోలు:

దారువుతో డొల్లగా చేసిన ఈ వాయిద్యానికి రెండు వైపులా జింక చర్మాన్ని గాని మేక చర్మాన్ని గాని ఉపయోగిస్తారు. వెదురు ముక్కలూ, తాళ్ళతో ఈ చర్మాన్ని బిగువుగా వుంచుతారు.

టాబోర్:

ఈ వాయిద్యం రెండు ప్రక్కలా వాయించ వలసిన వాయిద్యమిది. స్థూపాకారంలో వుండే ఈ వాయిద్యం మధ్యలో కొంచెం ఉబ్బెత్తుగా వుంటుంది. చట్రాన్ని మట్టితో చేసి కాలుస్తారు. రెండు ప్రక్కలా అనువుగా మేక చర్మాన్ని అమర్చి బిగించుతారు. తోలు పట్టీలతో ఈ రెండు వైపుల చర్మాన్ని బిగించ టానికి వీలుంటుంది. ఈ వాయిద్యాన్ని కేవలం వ్రేళ్ళతో వాయిస్తారు. ముఖ్యంగా ... ఆరకు లోయలో దీనిని అన్ని జాతుల వారు వాయిస్తారు.

రెండవ రకం డోలు:

ఇది కూడ పైన వివరించిన డోలు లాంటిదే. మెడకు తగిలించుకుని, డోలును పొట్టకు ఆనించి ఒక చేతితో వెదురు పుల్ల తోనూ, మరో చేతి వ్రేళ్ళతోనూ అప్పుడప్పుడు అర చేతితోనూ వాయిద్యాన్ని సాగిస్తారు.

గోగోడ్ - రాజన్:

ఈ వాయిద్యాన్ని శ్రీ కాకుళం జిల్లాలో వున్న సవరలు ఉపయోగించే సంగీత వాయిద్యమిది. మామూలు కొబ్బరి చిప్పను ఈ వాయిద్యానికి స్వర పేటికగా