Jump to content

పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/480

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సుద్దులు చెప్పే గొల్లసుద్దులు

గొల్లసుద్దులను చెప్పే వారు గొల్లలను మాత్రమే యాచిస్తారు. యాదవ చరిత్రకు సంబంధించిన కృష్ణ లీలలు కాటమ రాజు కథ మొదలైన వాటిని

సుద్దులవారు ప్రచారం చేస్తూ వుంటారు. ఈ ప్రచారకులు ఆంధ్రదేశమంతటా వున్నారు. అయ్యలరాజు నారాయణామాత్యుడు హంస వింశతిలో గొల్లసుద్దులను ఈ విధంగా వర్ణించాడు.

పద్యం:

కొమ్ములు దీరణాలు జిగుగుల్కెడు వ్రాతల కృష్ణ లీలలం
గ్రమ్ము గుడార్లు వీరుడగు కాటమరాజు కథానులాపముల్
బమ్మిన పుస్తకాలు ముఖ పట్టిడి కట్టురుమాలలున్నెటా
సొమ్ములు నావముల్ వెలయు సుద్దుల గొల్లలు వచ్చిరెంతయున్.

గుడ్దలమీద బొమ్మల కథలు:

గొల్లసుద్దుల వారి కథా వివరాన్నీ, పెద్ద పెద్ద వస్త్రాలపై చిత్రించి బొమ్మల సహాయంతో కథలు చెపుతారు. వీరి మాదిరే తెలంగాణాలో పాండవులనే తెగ