పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/46

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బౌద్ధ యుగంలో వర్ధిల్లిన కళలు

హీనయాన, మహాయాన:

శాతవాహన రాజులు గాఢమైన హిందూ మతాభి మానులై నప్పటికీ దేశంలో బౌద్ధ మతం విరివిగా వ్యాపించింది. వ్యాపారులు, రైతులు, వివిధ వృత్తుల పనివారు చాలావరకు బౌద్ధమతాన్ని అభిమానించారు. బ్రాహ్మణులు మాత్రం హిందూమతాన్ని, హిందూ దేవతలను ఎక్కువ ఆరాధించారు, శాతవాహన రాజులు మాత్రం వివిధ మతాల వారిని సమాన దృష్టితో చూశారు. ఆనాడు రాజులకు రైతులకు వృత్తి పని వారల మధ్య వర్గకలహం తీవ్రంగా వుండేది. గ్రామ జీవితంలో పీడించేవారు, పీడింప బడే వారు వుండే వారు. కుల భేదాలను, వర్గ భేదాలను నిరసించి సర్వ సమానత్వాన్ని బోధించడం వల్ల పీడిత ప్రజానీకానికి బౌద్ధ మతం ఒక్క ఆశాజ్యోతిగా నిలబడింది. అందువల్ల ఆనాటి కార్మికులు, రైతులు ఇతర పీడిత ప్రజానీకమంతా బౌద్ధమతాన్ని గాడంగా అభిమానించారు. ముఖ్యంగా శిల్పులు బుద్ధునిపై గల తమ భక్తి భావాన్ని ప్రదర్శించడానికి బౌద్ధ విగ్రహాలను చెక్కి పూజించడం మొదలు పెట్టారు. కాని బుద్ధుని విగ్రహరూపంలో పూజించ వచ్చునా, కూడదా అన్న మీమాంసలో బౌద్ధులలో హీన యాన, మహాయాన ఆనె రెండు విభాగాలు ఏర్పడ్డాయి. మహాయాన శాఖవారు పూజించవచ్చునన్నారు, హీనయానవారు వ్వతిరేకించారు. కాని క్రమేపి మహాయాన శాఖ అభివృద్ధి చెంది ప్రపంచమంతటా బౌద్ధమతం వ్యాపించింది.

కళలు పండిన నాగార్జున కొండ:

కాని ఆర్థిక వ్వవస్థలో అణగి పోతున్న పీడిత ప్రజాసామాన్యానికి బౌద్ధమతం సాంఘిక, ఆర్థిక సమానత్వం కలిగిస్తుందని మొదట్లో ఆశించారు. కాని అలా జరుగ లేదు. బౌద్ధమతంలోని సమానత్వ సిద్ధాంతాలన్నిటినీ అహింసా సూత్రాలతో బంధించడం వల్ల రాజరిక వ్వవస్థకు భంగం కలుగదని భావించిన రాజులందరూ బౌద్ధమతాన్ని