Jump to content

పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/47

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

స్వీకరించారు. అంతేకాక ప్రారంభంలో వర్ణ వ్వవస్థను వ్వతిరేకించిన బౌద్ధమతం క్రమేపి వర్ణ వ్యవస్థతో కూడా రాజీపడింది. ఈ విధానం వల్ల వివిధ జాతులకూ చెందిన వారు వారి కులాచారాలను అనుసరిస్తూ బుద్ధుని దేవునిగా ఆరాధించారు. శిల్పులు శిల్పాలను చెక్కారు. చిత్రాలను చిత్రించారు. సంగీత, సృత్యాలతో వారి ఆనందాన్ని వెల్లడించారు. ఇలా బుద్ధుని ఆరాధించే వారందరికి నాగార్జున కొండ కేంద్రమై అక్కడ శూద్రతీర్థం అనేది ఏర్పడింది. బౌద్ధమతంలో వచ్చిన ఈ పరిణామాలను ఆచార్య నాగార్జునుడు మరికొంత ముందుకు తీసుకు వెళ్ళారు.

నాగార్జున లలితకళానిలయం:

ఆచార్య నాగార్జునుడు క్రీస్తు శకం రెండు మూడు శతాబ్దుల మధ్య ధాన్య కటకం (నేటి ధరణికోట) ను రాజధానిగా పరిపాలించిన యజ్ఞశ్రీ శాతకర్ణి ఆస్థానంలో వుండి దేశ దేశాలు సంచారం చేసి చివరి రోజుల్లో నాగార్జునుని కొండ మీద ఆశ్రయం నిర్మించుకొని ఇక్కడే మరణించిన ఆంధ్రుడు.

నాగార్జునుడు శూన్య వాదం - లేక మాధ్యమికవాదం అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించి బౌద్ధమతంలో ఒక పెద్ద మార్పును తీసుకువచ్చాడు. ఆంథ్రులలో విశేషంగా వ్వాపించిన బౌద్ధమతం ఆంధ్ర సంస్కృతి పరిణామంలో ఎంతో ప్రాముఖ్యం వహించింది. పండితుడయిన నాగార్జునుడు దాదాపు 30 దర్శనా గ్రంధాలను రచించాడు. ఆయన గొప్ప పండితుడు. ఆనాటి నాగార్జునుని కొండ బౌద్ధ ఆరామంలో విద్యాబోధన, ఉచిత వైద్య చికిత్సలతో పాటు శిల్ప, చిత్రలేఖనం, సంగీతం, నాట్యమూ నేర్పబడేవి. లలిత కళలకు నిలయమైన అనేక బౌద్ధ ఆరామాలు ఆనాడు ఆంధ్ర దేశంలో ___నాగార్జునుని కొండ, అమరావతి, ధరణికోట, జగ్గయ్య పేట, భట్టి ప్రోలు, నందిగామ, ఘంటసాల, గుడివాడ, గోలి, రామతీర్థం, శంఖరం మొదలైన ప్రాంతాల లోనే గాక, తెలంగాణాలోని, కొండాపురం, గుమ్మడిదుర్రు,ఫణిగిరి, గాజులబండ, అల్లూరు మొదలైన చోట్ల కూడ __ ప్రసిద్ధంగా వుండేవి.

అందాలు చిందిన ఆరామాలు:

అంతేగాక ఆంధ్ర దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దేవాలయాలన్నీ ఒకప్పుడు బౌద్ధ ఆరామాలున్నచోట కట్టబడినవే. ఈ వైష్ణవ దేవాలయాల మీద సంగీత, నృత్య