పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/45

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాజధానిగా చేసుకుని దక్షిణాపథంతో పాటు సింహళాన్ని జయించి సప్త గోదావరి వద్దనున్న ద్రాక్షారామ భీమేశ్వరాలయానికి వచ్చి, అక్కడ సింహళ రాజ పుత్రిక లీలావతిని వివాహం చేసుకున్నట్లు లీలావతి కావ్యంద్వారా తెలుస్తున్నది. హాలుడు తన ఆస్థానంలో కవి, పండిత, నాయక, శిల్పులను ఆదరించినట్లు తెలుస్తూ వుంది.

కళలను చెప్పిన గాథా సత్పశతి:


క్రీస్తుకు పూర్వమే ఆంధ్ర దేశంలో సంగీతం, నృత్యం, నాటకంతో పాటు అనేక వాద్య విశేషాలు ప్రచారంలో వున్నట్లు హాలశాతవాహనుడు రచించిన గాధా సప్తశతి తెలియజేస్తూ వుంది. హాలుడు గాథా సప్తశతిని మహారాష్ట్ర ప్రకృత భాషలో రచించినా తెలుగు దేశానికి సంబంధించిన అనేక కళా రూపాలను ఉదహరించాడు. ప్రాకృత భాషలో 700 గాథల్ని రసవత్తరంగా రూపొందించాడు. ఆంధ్రదేశపు ఆనాటి సాంఘిక జీవితాన్ని తెలుసుకోవడానికి ఇదే ముఖ్యమైన గ్రంథం. క్రీస్తుశకం ప్రథమ శతాబ్దంలో నాటి లలిత కళలకు సంబంధించిన ఈ క్రింది వివరాలు గాథా సప్తశతి తెలియజేస్తూ వుంది.

1. జనపచేను హరి తాల ( ఆంటె అరదళము ) మండిత ముఖంతో మెరసే నటివలె అందముగా ఉన్నదట. 2. గోపికల నర్తనాన్ని శ్లాఘించే నెపాన ఒక గోపిక వారి చెక్కిళ్ళమీద ప్రతిబింబిస్తున్న కృష్ణుని ముద్దు పెట్టుకున్నదట. (2_14) 3. నర్తించి నర్తించి, అలసటగొన్న వాలుగంటి మొదలైన వారితో కలయిక ఆహ్లాదకరమట. (3_50) 4. ముఖమున అన్నం వున్నంత వరకే మద్దెల మధురంగా పలికి అది లేనిచో విరసముగా మొఱుగునట. ( 3_53 )

పై పుదాహరణలతో పాటు గాథాసప్తశతిలో నాటకాలు, సంగీతం, మృదంగం, మురాజ, వీణ మొదలైన వాద్య విశేషాలు ప్రచారంలో వున్నట్టు కూడ తెలుపబడింది.

(పి.ఎస్.ఆర్. అప్పారావ్ )
నాట్యశాస్త్రం.